Tirumala: పుణ్యస్థలం తిరుమలలో కూడా ప్రాంక్స్ పైత్యమా.. భక్తుల ఆగ్రహం
తిరుమల అంటే ఆ వెంకన్న కొలువుతీరిన పవిత్రమైన స్థలం. కోట్లాడి మంది భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవాన్ని భక్తితో దర్శించే ప్లేస్. అక్కడ కూడా కొందరు ఆకతాయిలు ప్రాంక్ వీడియోలు చేయడంపై భక్తులు భగ్గుమంటున్నారు. ఆకతాయులు.. వారి పైత్యాన్ని తిరుమల కొండకు తీసురావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తిరుమల క్యూ లైన్‌లో ప్రాంక్ వీడియోల కలకలం చెలరేగింది. నారాయణగిరి షెడ్స్‌లో ప్రాంక్ వీడియోలు చిత్రీకరించారు ఆకతాయిలు. ఆలయ సిబ్బంది కంపార్ట్‌మెంట్ తాళాలు తీస్తున్నట్టు ప్రాంక్ వీడియోలు చేసి.. భక్తులను ఇబ్బందులకు గురి చేశారు. వీడియోలు తీసిన యువకుడిని తమిళనాడుకు చెందిన వాసన్‌గా గుర్తించారు. మిత్రులతో కలిసి తిరుమలలో అతను ప్రాంకె వీడియోలు చేశాడు. వాటిని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. భక్తులపై ప్రాంక్ వీడియోల చిత్రీకరణపై విమర్శలు వస్తున్నాయి. వారిపై చర్యలు తీసుకోవాలని.. ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Jul 11, 2024 07:06 PM
వైరల్ వీడియోలు
రోడ్లు బాగు చేయాలంటూ రోడ్డుపై పొర్లు దండాలు
దూసుకెళ్తున్న ఎమ్మెల్యే కారు... ఆపిన పోలీసులు.. ఆ తర్వాత
విషాదం అంటే ఇదే... ఆ దాత నుంచి కిడ్నీ తీసుకున్న వారాలకే
‘దురంధర్’ పాటకు పాక్‌లో దుమ్మురేపేలా డాన్స్
గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాదికి ఒక్కసారే...
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు

