AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakshmi Parvathi: జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని స్వాధీనం చేసుకోవాలి.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు..

లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కాగా.. ఇప్పటివరకు ఎన్టీఆర్, అమిత్ షా భేటీపై కీలక విషయాలేవీ బయటకు రాలేదు. కేవలం సినిమాల గురించే చర్చించనట్లు బీజేపీ నేతలు అభిప్రాయపడున్నారు.

Lakshmi Parvathi: జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని స్వాధీనం చేసుకోవాలి.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు..
Tdp
Shaik Madar Saheb
|

Updated on: Aug 24, 2022 | 1:53 PM

Share

Lakshmi Parvathi on Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అనంతరం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్, అమిత్ షా డిన్నర్ డిస్కషన్‌పై వాడీవేడిగా చర్చ కొనసాగుతోంది. వై ఓపు వైఎస్ఆర్‌సీపీ, మరోవైపు బీజేపీ, టీడీపీ దీనిపై పలు అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నాయి. ఈ సమావేశంపై ఏపీ తెలుగు, సంస్కృతి అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి కూడా స్పందించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ లక్ష్మీపార్వతి ఆకాంక్షించారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడంతోపాటు తెలుగుదేశం పార్టీని స్వాధీనం చేసుకోవాలంటూ లక్ష్మీ పార్వతి సూచించారు. అదే తన కోరిక అంటూ లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా వ్యవహరించి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నారంటూ ఆరోపించారు. జూనియర్ ఎన్టీఆర్ అయితే.. పార్టీని సమసర్థవంతంగా నడిపించగలరంటూ అభిప్రాయపడ్డారు.

కాగా.. లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కాగా.. ఇప్పటివరకు ఎన్టీఆర్, అమిత్ షా భేటీపై కీలక విషయాలేవీ బయటకు రాలేదు. కేవలం సినిమాల గురించే చర్చించనట్లు బీజేపీ నేతలు అభిప్రాయపడున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన అమిత్ షా.. ఎన్టీఆర్ నటనను అభినందించారని.. దీనిలో భాగంగా ఆయనతో చర్చించినట్లు బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. దీనిని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదంటూ పేర్కొంటుండగా.. వైసీపీ మాత్రం రాజకీయ లబ్ధి కోసమే షా.. ఎన్టీఆర్ భేటీ జరిగినట్లు పేర్కొంటోంది.

ఘనంగా గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి వేడుకలు..

ఇవి కూడా చదవండి

స్వర్గీయ గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు లక్ష్మీపార్వతి ప్రకటించారు. ఈనెల 25న తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ వేదికగా గిడుగు బాషా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గిడుగు బాషా ఉత్సవాల సందర్భంగా రేపు ఆరుగురిని పురస్కార గ్రహీతలుగా ఎంపిక చేస్తామని.. త్వరలోనే పేర్లను ప్రకటిస్తామని లక్ష్మిపార్వతి తెలిపారు. చంద్రబాబు హయాంలో విద్యాశాఖను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, రాష్ట్రవ్యాప్తంగా 30 వేల స్కూల్స్ మూత పడ్డాయని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు కు శ్రీకారం చుట్టిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని అభిప్రాయపడ్డారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..