AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Crime News: తండ్రి కాదు కసాయి..కన్న బిడ్డల్ని చిమ్మచీకట్లో వదిలేసి.. ఆ తర్వత..

అభంశుభం ఎరుగని పసి పిల్లలను ఓ కసాయి తండ్రి చిమ్మచీకట్లో వదిలేశాడు. మద్యం మత్తులో కట్టుకున్న భార్యను..

AP Crime News: తండ్రి కాదు కసాయి..కన్న బిడ్డల్ని చిమ్మచీకట్లో వదిలేసి.. ఆ తర్వత..
Dark Night
Srilakshmi C
|

Updated on: Aug 24, 2022 | 1:01 PM

Share

AP crime news: అభంశుభం ఎరుగని పసి పిల్లలను ఓ కసాయి తండ్రి చిమ్మచీకట్లో వదిలేశాడు. మద్యం మత్తులో కట్టుకున్న భార్యను చితకబాది, కడుపున పుట్టిన పిల్లలను వదిలించుకోవాలని ఊరిబయట వదిలేస్తే.. రాత్రంతా చలికి వణుకుతూ ఆ పసి శరీరాలు అల్లాడిపోయాయి. వివరాల్లోకెళ్తే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కోడుమూరులో కృష్ణ, సుజాత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమార్తె, నలుగురు కుమారులు. కృష్ణ మద్యానికి బానసయ్యి భార్యను నిత్యం వేధించేవాడు. సోమవారం (ఆగస్టు 22) రాత్రి ఫూటుగా మద్యం సేవించిన కృష్ణా భార్యతో గొడవపడి దారుణంగా కొట్టాడు. భార్య, పిల్లలు బంటు(3), మహేంద్ర(5)లను ఆటోలో ఎక్కించుకుని ఊరికి దూరంగా తీసుకెళ్లి భార్యను దింపి, మరోసారి కొట్టడంతో ఆమె స్పృహ తప్పింది. ఆమెను అక్కడే వదిలేసి ఇద్దరు కుమారులను పొరుగూరు ప్యాలకుర్తిలోని దిగువ కాల్వ గట్టు వద్ద కారు చీకటిలో వదిలేశాడు. కటిక చీకటిలో పిల్లలిద్దరూ భయంతో కేకలు పెట్టి ఏడ్చినా తండ్రి కృష్ణకు మనసు కరగలేదు. రాత్రంతా చలిలో వణుకుతూ, భయంతో ఏడుస్తున్న పిల్లలను తెల్లవారుజామున పొలాలకు నీరుపెట్టేందుకు వచ్చిన రైతులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చిన్నారులను ప్రశ్నించగా తల్లి గురించి చెప్పారు. భార్య ఫిర్యాదు మేరకు మంగళవారం కృష్ణను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి భార్యభర్తలిద్దరినీ మందలించి పిల్లలను అప్పగించారు. ఈ విషయం తెలిసిన బాలల సంరక్షణ నిర్వాహకులు నిందితుడు కృష్ణపై ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు.

769943,769964,769886,769914