AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆలూరులో స్టూడెంట్స్‌ మధ్య గ్యాంగ్‌వార్.. చిన్న గొడవ ముదిరి, ముదిరి పరస్పర దాడులు.. విజువల్స్‌

చిన్నగొడవ పెద్దదిగా మారింది. ఓ జూనియర్‌ కాలేజీలో రచ్చ క్రియేట్‌ చేసింది. స్టూడెంట్స్‌ మధ్య గ్యాంగ్‌ వార్‌కు దారితీసింది. కర్నూలు జిల్లా ఆలూరులో స్టూడెంట్స్‌ మధ్య గ్యాంగ్‌వార్‌ కలకలం రేపింది.

ఆలూరులో స్టూడెంట్స్‌ మధ్య గ్యాంగ్‌వార్.. చిన్న గొడవ ముదిరి, ముదిరి పరస్పర దాడులు.. విజువల్స్‌
Ram Naramaneni
|

Updated on: Mar 10, 2021 | 8:39 PM

Share

చిన్నగొడవ పెద్దదిగా మారింది. ఓ జూనియర్‌ కాలేజీలో రచ్చ క్రియేట్‌ చేసింది. స్టూడెంట్స్‌ మధ్య గ్యాంగ్‌ వార్‌కు దారితీసింది. కర్నూలు జిల్లా ఆలూరులో స్టూడెంట్స్‌ మధ్య గ్యాంగ్‌వార్‌ కలకలం రేపింది. జూనియర్ కళాశాల విద్యార్థులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల మధ్య చిన్న గొడవ జరిగింది. మూడు రోజుల కిందట జరిగిన ఈ గొడవ రచ్చకు దారితీసింది. ఈ చిన్న గొడవ ముదిరి గ్యాంగ్‌లుగా విడిపోయి విద్యార్థులు కొట్టుకున్నారు.

విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకోవడంతో కాలేజీలో ఉద్రిక్త వాతావరణం క్రియేట్‌ అయింది. ఈ గొడవలతో భయపడ్డ ఇతర విద్యార్థులు కాలేజీ నుంచి పారిపోయారు. కాలేజీ గ్రౌండ్‌లో అర గంటపాటు రెండు గ్యాంగ్‌లు బీభత్సం సృష్టించాయి. ఒకరినొకరు తోసుకోవడం, అరుపులు, కేకలతో ఆలూరు జూనియర్‌ కాలేజీ గ్రౌండ్‌ రణరంగంగా మారింది. విద్యార్థులు ఇరువర్గాలుగా విడిపోయిఒకరిపై మరొకరు దాడులు చేసుకొన్నారు. విద్యార్థుల పరస్పరం చేసుకొన్న దాడులను చూసి మరికొందరు విద్యార్థులు భయంతో కళాశాల నుంచి బయటకు వెళ్లిపోయారు. కళాశాల యాజమాన్యం సిబ్బంది విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణను నియంత్రించేందుకు కూడా  ప్రయత్నం చేయలేకపోయింది. పోలీసులు అక్కడకి చేరుకొని ఘర్షణకు దిగిన విద్యార్థులను గుర్తించే పనిలో పడ్డారు.

కాగా విద్యాబుద్దులు నేర్చుకోవాల్సిన ప్లేసులో స్టూడెంట్స్ స్ట్రీట్ ఫైట్‌కు దిగడంతో పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు కలగజేసుకుని సమస్యను శాంతియుతంగా పరిష్కరించి పూర్వ పరిస్థితులు తీసుకురావాలని కోరుతున్నారు. లేకుంటే ఎంతో భవిష్యత్ ఉన్న వారి జీవితాలు నాశనమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read:

ఏపీ మున్సిపల్ ఎన్నికల వేళ సడెన్‌గా మెరిసిన లగడపాటి రాజగోపాల్.. ప్రజల నాడి ఎలా ఉందని అడిగితే..?

వివాదంపై తొలిసారి స్పందించిన దర్శకుడు శేఖర్ కమ్ములు.. ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు