Andhra Pradesh: తన తనయుడిని అంగన్వాడీ కేంద్రంలో చదివిస్తున్న కర్నూలు జిల్లా కలెక్టర్..సర్వత్రా ప్రశంసల వర్షం

ఆంధ్రప్రదేశ్ లోని ఓ జిల్లాకు చెందిన కలెక్టర్ తన ముద్దుల కుమారుడిని అంగన్ వాడి కేంద్రానికి పంపిస్తూ.. పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Andhra Pradesh: తన తనయుడిని అంగన్వాడీ కేంద్రంలో చదివిస్తున్న కర్నూలు జిల్లా కలెక్టర్..సర్వత్రా ప్రశంసల వర్షం
Kurnool District Collector
Follow us
Surya Kala

|

Updated on: Jun 03, 2022 | 7:00 PM

Andhra Pradesh: నేటి సమాజంలో సామాన్య ప్రజలు వేరు, ఉన్నతస్థాయి వర్గాలు వేరు అన్నచందంగా పరిస్థితులున్నాయి. అందుకనే ప్రజలకు సేవ చేస్తామని ప్రజలతో ఎన్నుకోబడుతున్న ప్రజాప్రతినిధులు.. ప్రజలకు సేవ చేయడానికి ఉన్నత పదవులను చేపట్టిన అధికారులు చాలామంది తమ ఆర్ధిక పరిస్థితి అనుగుణంగా తమ జీవితాన్ని ఎంచుకుంటున్నారు. కానీ నిజానికి వీరు చేసే పనులు ప్రజలు అనుసరించే విధంగా ఉండాలి. ముఖ్యంగా  ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవడం, ప్రభుత్వ పాఠశాల్లో తమ పిల్లలను చదివించడం వంటి పనులు చేస్తే.. వారిని సామాన్యులు అనుసరించే అవకాశం ఎక్కువ. అందుకనే ఇటీవల కొంతమంది ఉన్నతాధికారులు తమ కుటుంబ సభ్యుల విషయంలో తీసుకునే నిర్ణయాలతో ప్రజలకు భరోసానిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ఓ జిల్లాకు చెందిన  కలెక్టర్ తన ముద్దుల కుమారుడిని అంగన్ వాడి కేంద్రానికి పంపిస్తూ.. పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

కర్నూలు కలెక్టర్ కోటేశ్వరరావు… తన మూడేళ్ళ కొడుకు దివి ఆర్విన్ ను అంగన్వాడి స్కూల్ లో చదివిస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. ఆదర్శంగా నిలుస్తున్నారు కూడా. గత కొంత కాలంగా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్ లోనే చదివించాలనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా వస్తుండటంతో కలెక్టర్ స్పందించారు. తనకున్న ఒకే ఒక్క కొడుకు దివి ను తన బంగ్లా కు దగ్గరలో ఉన్న అంగన్వాడి స్కూల్ లో చేర్పించారు. నాలుగేళ్ళ చిన్నారి దివి ఆర్విన్  ను బుధవార పేట అంగన్వాడీ ప్రీ స్కూల్ లో చేర్పించారు జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు. దివి ఆర్విన్ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలతో కూర్చుని రంగులు దిద్దుకుంటూ, ఆట వస్తువులతో ఎంతో సంతోషంగా ఆడుకుంటున్నాడు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సదుపాయాలను ప్రజలందరూ ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ తన కుమారుడిని  అంగన్వాడీ కేంద్రంలో చేర్పించి సామాన్యులకు తెలిజేస్తున్నట్లు గా ఉన్నది కలెక్టర్ తీరు అంటూ అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?