Kodali Nani: బాబును వదిలి అన్నను నమ్ముకో.. పవన్ కల్యాణ్‌కు కొడాలి నాని సూచన..
Kodali Nani on Pawan Kalyan: భీమ్లా నాయక్ సినిమాపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల వ్యవహారంపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై నాని ఘాటుగా స్పందించారు. నాగార్జున అయినా.. పవన్ కల్యాణ్ అయినా
Kodali Nani on Pawan Kalyan: భీమ్లా నాయక్ సినిమాపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల వ్యవహారంపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై నాని ఘాటుగా స్పందించారు. నాగార్జున అయినా.. పవన్ కల్యాణ్ అయినా ప్రభుత్వం దృష్టిలో ఒకటేనని తెలిపారు. సీఎం జగన్ (YS Jagan) కు కుట్రలు, కుతంత్రాలు తెలియదని స్పష్టంచేశారు. భీమ్లా నాయక్ సినిమా (Bheemla Nayak Movie) కు రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి షరతులు పెట్టలేదని గుర్తుచేశారు. టికెట్ల రేట్లపై కమిటీ సూచనలు చేసిందని.. కానీ పెంచే లోపు అవాంతరాలు వచ్చాయని నాని తెలిపారు. సీఎం జగన్ దగ్గర చిరంజీవి విన్నపంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నాని స్పందించారు. పవన్ కల్యాణ్ మాటలు సరికాదంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన పవన్‌కు సూచించారు. సినిమాలను.. రాజకీయాలకు ముడిపెట్టొద్దని సూచించారు. టీడీపీ, జనసేన నాయకులు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని పేర్కొన్నారు. ఈ మేరకు కొడాలి నాని ఆదివారం మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు ఉచ్చులో పడొద్దని పవన్‌కు సూచించారు. చిరంజీవిని జగన్ ఎంతో గౌరవిస్తారని.. దానిని తప్పుబట్టడం సరికాదన్నారు. పిల్లల్లో పిల్లవాడిలా.. పెద్దల్లో పెద్దవాడిగా చిరంజీవి ఉంటారని.. ఆయన్ను చిల్లర రాజకీయాల్లోకి లాగడం సరికాదన్నారు. చంద్రబాబు కోసం సొంత తమ్ముడే.. అన్నను అవమానిస్తారా..? అంటూ ప్రశ్నించారు. పవన్, ఆయన కుటుంబం ఉన్నత స్థానంలో ఉందంటే చిరంజీవి కారణం కాదా..? అని ప్రశ్నించారు. సీఎం అంటే రాష్ట్రానికి, సినిమా రంగానికి పెద్దగా ఉన్నారని తెలిపారు. జగన్ అందరివారని తెలిపారు. 2024లో వైసీపీ ఒంటరిగానే పోటీచేస్తుందని.. ప్రజల ఆశీస్సులతో మళ్లీ జగన్ సీఎం అవుతారన్నారు. సీఎం గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సూచించారు.
దీంతోపాటు కొడాలి నాని సీపీఐ నేత నారాయణపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన ఒక వింత వ్యక్తి అంటూ ఎద్దెవా చేశారు. రష్యా, ఉక్రెయిన్ యుద్దంపై ఎవరి పక్షమో తేల్చుకోలేని పార్టీ నేత తమకు చెప్పడం ఏంటంటూ మండిపడ్డారు. సీపీఐ నారాయణ పనికిమాలిన విమర్శలు చేస్తున్నారన్నారు.
కొడాలి నాని ప్రెస్‌మీట్ మొత్తం ఈ వీడియోలో చూడండి..
Also Read: