Roja Selvamani : భీమ్లా నాయక్ వర్సెస్ ఏపీ సర్కార్.. పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేసిన రోజా..
ప్రస్తుతం ఏపీలో సినిమా వర్సెస్ సర్కార్ ఫైట్ జరుగుతోంది. ఆంధ్రాలో ఇప్పుడు భీమ్లా నాయక్ వర్సెస్ ఏపీ సర్కార్ ఫైట్ రసవత్తరంగా నడుస్తోంది.
Roja Selvamani : ప్రస్తుతం ఏపీలో సినిమా వర్సెస్ సర్కార్ ఫైట్ జరుగుతోంది. ఆంధ్రాలో ఇప్పుడు భీమ్లా నాయక్ వర్సెస్ ఏపీ సర్కార్ ఫైట్ రసవత్తరంగా నడుస్తోంది. టీ ఎస్, ఏపీలో ఇప్పుడిదే హాట్ అండ్ సెన్సేషనల్ టాపిక్. ఏపీ సర్కార్‌తో ఢీ అంటే ఢీ అంటోంది భీమ్లా నాయక్. ఇంతకీ, భీమ్లా నాయక్, ఏపీ సర్కార్ మధ్య జరుగుతోన్న ఫైట్ ఏంటంటే..సినిమా టికెట్ రేట్స్, ఏపీలో కొన్ని నెలలుగా నానుతోన్న ఇష్యూ, పవన్‌పై కక్షతోనే టికెట్ రేట్లు తగ్గించారనేది టాక్. సీరియల్‌ను తలపించేలా నడిచింది సినిమా కథా చిత్రం. చివరికి, సీఎం జగన్‌తో చిరంజీవి అండ్ టీమ్ భేటీతో శుభం కార్డు పడిందని భావించారు. టికెట్ రేట్లు పెంచుతూ కొత్త జీవో ఇవ్వనున్నట్లు ప్రకటనలు వచ్చాయ్. భేటీ జరిగి చాలా రోజులు గడిచిపోయాయ్, కానీ జీవో రాలేదు, ఇదే ఇప్పుడు మంటలు రాజేస్తోంది ఏపీలో.
అప్పుడు వకీల్‌సాబ్-ఇప్పుడు భీమ్లా నాయక్. అవును, అప్పుడైనా, ఇప్పుడైనా ఏపీ ప్రభుత్వం టార్గెట్ పవనే అంటున్నారు ఆయన సోదరుడు నాగబాబు. పవన్‌పై ప్రభుత్వం పగబట్టింది, కక్షగట్టింది, టార్గెట్ చేసింది అంటూ హాట్ కామెంట్స్ చేశారు. పవన్‌ను అణగదొక్కేందుకే మూవీ టికెట్స్ పెంపుపై కొత్త జీవో ఇవ్వలేదన్నారు నాగబాబు. లేటెస్ట్‌గా నాగబాబు చేసిన ఆరోపణలకు ఇంతకుముందే క్లారిటీ ఇచ్చేశారు ఏపీ మంత్రి పేర్ని నాని. కొత్త జీవో ఇచ్చేవరకు మూవీ రిలీజ్‌ను వాయిదా వేసుకోవచ్చుగా అంటూ సెటైర్లు వేశారు మంత్రి. పవన్‌కు అంత బాధ ఎందుకో తనకు అర్ధం కావడం లేదంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. పవన్ ఏమైనా ప్రొడ్యూసరా? డిస్ట్రిబ్యూటరా?. పవన్‌ను తొక్కేయాల్సిన అవసరం తమకేంటి అంటున్నారు రోజా. అల్లు అర్జున్ పుష్ప, బాలకృష్ణ అఖండ సినిమాలకు ఏ రేట్లయితే ఉన్నాయో, ఇప్పుడూ అవే రేట్స్ ఉన్నాయ్. ఇందులో అన్యాయం ఏముందని ప్రశ్నిస్తున్నారు రోజా. నాగబాబు కామెంట్స్‌కు గట్టిగానే కౌంటరిచ్చారు రోజా. రేట్లు పెంచుకోవాలంటే జాయింట్ కలెక్టర్లకు అప్లై చేసుకోవచ్చుకదా? అంటున్నారు రోజా.
పవన్ కల్యాణ్ పై పగపట్టి ఇంత చేస్తుంటే ఎవరు నోరు మెదపడం లేదు. సినిమా పెద్దలు కళ్యాణ్ కు మద్దతు ప్రకటించకపోవడం దురదృష్టకరం. నిర్మాతలు, దర్శకులు, హీరోలకు ఇది తప్పు అని చెప్పడానికి ఎందుకు ధైర్యం చాలడం లేదు. ఒక అగ్ర హీరోకే ఇంత జరుగుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటీ. సినీ పరిశ్రమ భయాన్ని, అభద్రతా భావాన్ని పవన్ అర్థం చేసుకుంటున్నాడు. ఏ హీరోకైనా, ఏ నిర్మాతకైనా, ఏ దర్శకుడికైనా ఇలాంటి సమస్య వస్తే మేం ముందుటాం. మీరు మమ్మల్ని వదిలేసినా మా సహకారం ఎప్పుడూ ఉంటుంది అన్నారు నాగబాబు. దీనిపై రోజా స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ను తొక్కేయాలని మేమెందుకు చూస్తాం.. అయినా ఆయన ప్రొడ్యూసరా.. లేక డిస్టిబ్యూటరా..? అని ప్రశ్నించారు రోజా. టికెట్ ధరల నిర్ణయం ఒక కొలిక్కకి వస్తుందనుకునే సమయంలో మంత్రి గౌతమ్ రెడ్డి మరణించడంతో కాస్త ఆలస్యం అయ్యింది.. ఈ లోగా సినిమా రిలీజ్ అయ్యింది, అని రోజా వివరణ ఇచ్చారు. అలాగే తన సినిమాను అడ్డుపెట్టుకొని తమ పార్టీని నిలబెట్టుకోవాలని పవర్ రాజకీయం చేస్తున్నారని రోజా ఫైర్ అయ్యారు. మరి దీనిపై నాగబాబు, పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :