Andhra: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ శిలాశాసనం.. దానిపై రాసున్నది ఆరా తీయగా
రోమియో.. జూలియట్.. షాజహాన్.. ముంతాజ్ వంటి ప్రేమ కథలు ప్రజల్లో తరతరాలుగా వినిపిస్తున్నాయి. అయితే మచిలీపట్నం నేలపై 17 శతాబ్దంలో జరిగిన ఒక డచ్ ప్రేమ కథ మాత్రం చరిత్ర పుటల్లో దాగి ఉంది. దాదాపు 347 సంవత్సరాల క్రితం చోటు చేసుకున్న ఈ సంఘటన మళ్లీ చర్చనీయాంశమైంది.

రోమియో.. జూలియట్.. షాజహాన్.. ముంతాజ్ వంటి ప్రేమ కథలు ప్రజల్లో తరతరాలుగా వినిపిస్తున్నాయి. అయితే మచిలీపట్నం నేలపై 17 శతాబ్దంలో జరిగిన ఒక డచ్ ప్రేమ కథ మాత్రం చరిత్ర పుటల్లో దాగి ఉంది. దాదాపు 347 సంవత్సరాల క్రితం చోటు చేసుకున్న ఈ సంఘటన మళ్లీ చర్చనీయాంశమైంది. డచ్ వారు 1600లలో మచిలీపట్నంలో వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు చేరుకున్నారు. వారిలో జొహన్నెస్ క్రుజిఫ్ అనే యువకుడు స్థానిక ఫ్యాక్టరీలో క్లర్క్ గా పని చేసేవారు. ఆ సమయంలో డచ్ వ్యాపారి కి ఒక కుమార్తె కేథరినా వాన్ డెన్ బ్రియాన్ తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్ళికి సిద్ధమై తల్లిదండ్రుల అనుమతి కూడా పొందారు.
అయితే వారి సంబంధాన్ని కొంతమంది మంచిగా చూడలేదు. కేథరినా గురించి తప్పుడు ప్రచారం జొహన్నెస్ చెవిలో పడటంతో అతడు ఆమె నుంచి దూరమయ్యాడు. ఈ అకస్మాత్తు దూరం తీవ్ర మనస్థాపాన్ని కలిగించింది. ఆరోగ్యం క్షీణించి పడిపోయిన ఆమె చివరకు 1979 అక్టోబర్లో మరణించింది. ప్రియురాలి మరణవార్త జొహన్నెస్ పూర్తిగా మానసికంగా కృంగిపోయేలా చేసింది. తన నిర్ణయమే ఈ విషాదానికి కారణం అని భావన అతడిని మంచాన పాలు చేసింది. కొంతకాలానికి తన పరిస్థితి విషమంగా మారడంతో కేధరినా పక్కనే సమాధి చేయాలని తన కోరికను ఆమె తల్లిదండ్రులకు తెలిపాడు. జీవితంలో అపోహలు వారిని దూరం చేసినా.. మరణాంతరం కూడా ప్రేమను విడవాని జొహన్నెస్ కోరిక నెరవేరింది. మచిలీపట్నంలో నేటికి ఈ జంట సమాధులు అరుదైన ప్రేమకు గుర్తుగా నిలుస్తున్నాయి.
