AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఉదయాన్నే డ్యూటీకి వెళ్తూ బైక్ తీశాడు.. ఇంతలో అదో మాదిరి శబ్దాలు.. ఏంటా అని చూడగా

ఓ వ్యక్తి ఉదయాన్నే తన ఆఫీస్‌కు వెళ్లేందుకు బైక్ తీశాడు. ఈలోపు ఏవో శబ్దాలు వినిపించాయి. ఇదేం వింత శబ్దాలు అన్నట్టుగా చూశాడు. బైక్ సీట్ తెరిచి చూడగా దెబ్బకు షాక్ అయ్యాడు. ఇంతకీ అదేంటో.. ఈ వార్తలో చూసేద్దాం. ఆ వివరాలు..

Andhra: ఉదయాన్నే డ్యూటీకి వెళ్తూ బైక్ తీశాడు.. ఇంతలో అదో మాదిరి శబ్దాలు.. ఏంటా అని చూడగా
Telugu News
Maqdood Husain Khaja
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 28, 2025 | 1:23 PM

Share

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీస్ క్వార్టర్స్ లో నాగుపాము కలకలం రేపింది. బైక్ సీటు కింద బుసలు కొడుతూ దర్శనమిచ్చింది ఓ నాగపాము. బైక్‌లో శబ్దం రావడంతో అనుమానం వచ్చి సీట్ ఓపెన్ చేయగా బైక్ యజమాని దెబ్బకు షాక్ అయ్యాడు. కోటనందూరు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శివాజీ.. ఉదయం డ్యూటీకి వెళ్లే సమయంలో బైక్ దగ్గరకు వచ్చేసరికి ఈ సీన్ చూసి కంగుతిన్నాడు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.