Visakhapatnam: కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ.. ఎన్ని కోట్లో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
విశాఖ వన్ టౌన్ లో వెలసిన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు మహాలక్ష్మిగా దర్శనమిస్తున్నారు. నాలుగు కోట్ల రూపాయల కరెన్సీ నోట్లతో కన్యకా పరమేశ్వరి గర్భగుడిని అలంకరించారు. అలంకరణలో రూపాయి నోటు నుంచి 500 రూపాయల నోటు వరకు ఇండియన్ కరెన్సీలో ఉన్న అన్ని నోట్లను అలంకరణలో వినియోగించారు.
విశాఖ వన్ టౌన్ లో వెలసిన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు మహాలక్ష్మిగా దర్శనమిస్తున్నారు. నాలుగు కోట్ల రూపాయల కరెన్సీ నోట్లతో కన్యకా పరమేశ్వరి గర్భగుడిని అలంకరించారు. అలంకరణలో రూపాయి నోటు నుంచి 500 రూపాయల నోటు వరకు ఇండియన్ కరెన్సీలో ఉన్న అన్ని నోట్లను అలంకరణలో వినియోగించారు. అంతేకాదు.. మహాలక్ష్మిగా దర్శనమిస్తున్న అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అమ్మవారికి అలంకరించిన సువర్ణ చీర ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. బంగారు చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సువర్ణ ఆభరణాల అలంకరణలో అమ్మవారు దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సువర్ణ చీరతో పాటు ఆరు కిలోల బంగారు ఆభరణాలు, సువర్ణ పుష్పలు, బంగారు బిస్కెట్లు, బంగారు నాణేలను కూడా అలంకరణకు వినియోగించారు.
అంతేకాదు..పది కిలోల వెండి వస్తువులతోనూ అలంకరణ అమ్మవారి సన్నిధిని విశేషంగా అలంకరించారు. తెల్లవారుజామున సుగంధ ద్రవ్యాలు పంచామృతాభిషేకలతో అమ్మవారిని ప్రత్యేక పూజలు చేశారు. ఈరోజు అష్టమి కావడంతో మహాలక్ష్మిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. లక్ష రూపాయల కరెన్సీతో మొదలై.. ఈ ఏడాది నాలుగు కోట్ల రూపాయల భక్తుల తెచ్చిన కరెన్సీతో అలంకరించామని ఆలయ ప్రధాన అర్చకులు కుమార శర్మ తెలిపారు. భక్తులు తీసుకొచ్చి అలంకరించిన సొత్తును తిరిగి భక్తులకు అందజేస్తామన్నారు. రెండున్నర లక్షలతో అలంకారం మొదలై.. ఇప్పుడు నాలుగు కోట్ల కరెన్సీకి చేరిందని చెప్పారు.