AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLA Madhavi Reddy: కడప జిల్లా పోలీసులకే ఝలక్ ఇచ్చిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి.. ఏం చేశారంటే..?

కడప జిల్లా పోలీసుల తీరుపై కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి మండిపడుతున్నారు. విత్‌ అవుట్ ఇన్ఫర్మెషన్‌ తో గన్‌మెన్లను కుదించడంపై మనస్తాపం చెందారు. అసలు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదంటూ ఉన్న గన్‌మెన్‌లను సైతం వెనక్కి పంపారు ఎమ్మెల్యే మాధవి.

MLA Madhavi Reddy: కడప జిల్లా పోలీసులకే ఝలక్ ఇచ్చిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి.. ఏం చేశారంటే..?
Kadapa Mla Madhavi Reddy
Balaraju Goud
|

Updated on: Jul 24, 2024 | 9:10 AM

Share

కడప జిల్లా పోలీసుల తీరుపై కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి మండిపడుతున్నారు. విత్‌ అవుట్ ఇన్ఫర్మెషన్‌ తో గన్‌మెన్లను కుదించడంపై మనస్తాపం చెందారు. అసలు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదంటూ ఉన్న గన్‌మెన్‌లను సైతం వెనక్కి పంపారు ఎమ్మెల్యే మాధవి.

కడప జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్యాండ్‌గా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి గన్‌ మెన్‌ల తొలగింపు ఇష్యూ .. ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌‌గా మారింది. మాధవిరెడ్డి భర్త తెలుగు దేశం పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డికి నిన్నటి వరకూ ఉన్న వన్‌ ప్లస్ వన్‌ గన్‌మెన్‌లను తొలగించారు కడప పోలీసులు. వారిని వెనక్కి రావాలని పిలిచారు. అదే క్రమంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి ఉన్న టూ ప్లస్ టూ గన్ మెన్లను వన్ ప్లస్ వన్‌కు కుదించారు. వారిని వెనక్కి రావాలంటూ పిలిచారు.

అయితే ఎలాంటి ఇన్ఫర్మెషన్‌ లేకుండా తనకు సెక్యూరిటీ కుదించడంపై పోలీసుల తీరుపై ఆగ్రహించారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. కనీసం సెక్యూరిటీని వన్‌ ప్లస్‌ వన్‌కి తగ్గిస్తున్నట్లు తనతో ఒక్క మాటన్న చెప్పకుండా.. సెక్యూరిటీకి కాల్ చేసి రమ్మనడంపై ఎమ్మెల్యే మనస్థాపం చెందారు. తమకు ఎలాంటి థ్రెట్ లేదని.. షో తనకు వన్‌ ప్లస్‌ వన్‌ సెక్యూరిటీ కూడా అవసరం లేదంటూ ప్రజెంట్ ఉన్న వారిని వెనక్కి పంపించారు ఎమ్మెల్యే. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు సైతం సెక్యూరిటీ లేకుండా హాజరయ్యారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి.

గన్‌ మెన్ల ఇష్యూ జిల్లాలో సంచలనంగా మారింది. గతంలో తనకు కడప వైసీపీ అభ్యర్థి తమ్ముడి నుంచి థ్రెట్ ఉందంటూ మాధవిరెడ్డి కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దాంతో అప్పటి ఎస్పీ ఆమెకు గన్‌మెన్లను కేటాయించారు. ఆమె భర్తకు వన్‌ ప్లస్ వన్ ఇచ్చారు. ఇప్పుడు సెడన్‌గా విత్‌ అవుట్ ఇన్ఫర్మెషన్‌ లేకుండా గన్‌మెన్‌లను తొలగించారనేది ఎమ్మెల్యే వర్షన్‌. దీనిపై మాత్రం జిల్లా పోలీసులు ఇప్పటివరకూ స్పందించలేదు. సెక్యూరిటీ కుదించడంపై జిల్లా పోలీసులు ఏం చెప్తారనేదానిపై ఉత్కంఠగా నెలకొంది.

ఇక మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కడపలో పోటీ చేసిన మాధవిరెడ్డి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాపై భారీ మెజార్టీతో గెలిచారు. ఏకంగా మాజీ సీఎం ఇలాకాలో టీడీపీ జెండా ఎగురువేసి.. మాటల తూటాలతో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఎన్నికల అనంతరం తాను అంజాద్‌ బాషాపై కాదు.. జగన్‌పైనే గెలిచానంటూ కీలక కామెంట్స్ చేశారు మాధవిరెడ్డి. అలాంటి ఎమ్మెల్యేకి సెక్యూరిటీ తగ్గించడం కలకలం రేపుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..