Andhra: వీడు అమాయకుడేం కాదు.. రైలులో బాలిక ఒంటరిగా దొరికిందని.. టాయిలెట్‌లోకి తీసుకెళ్లి.!
2019 జనవరి 27న సాయంత్రం 6 గంటలకు బాధితురాలు తన తల్లితో కలిసి తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు బయల్దేరిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఒంటరిగా టాయిలెట్‌కు వెళ్ళింది. అదే రైలులో ప్రయాణిస్తున్న ప్రసాద్ రెడ్డి అనే నిందితుడు ఆ బాలికను వెంబడించి టాయిలెట్ లోపలికి..

బాలికపై లైంగిక దాడి కేసులో కడప పోక్సో కోర్టు చరిత్రక తీర్పునిచ్చింది. లైంగిక దాడి చేసిన నిందితుడికి జీవిత ఖైదీ, 10 వేల రూపాయల జరిమానా అలాగే బాధితురాలికి 10 లక్షల 50 వేల రూపాయల నగదును ఇవ్వాలంటూ గుంతకల్లు రైల్వే డివిజన్‌కు సంబంధించిన డీఆర్ఎమ్‌కు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక రైల్వే అధికారులపై, రైల్వే పోలీసులపై మెజిస్ట్రేట్ మండిపడ్డారు. వారిపై శాఖాపరమైన చర్యలకు కూడా ఆదేశించారు. అసలు ఇంతకీ నిందితుడు ఎవరు.? రైల్వే వాళ్లకి పనిష్మెంట్ ఏంటి అనే కదా..? చదివేయండి.
2019 జనవరి 27న సాయంత్రం 6 గంటలకు బాధితురాలు తన తల్లితో కలిసి తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు బయల్దేరిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఒంటరిగా టాయిలెట్‌కు వెళ్ళింది. అదే రైలులో ప్రయాణిస్తున్న ప్రసాద్ రెడ్డి అనే నిందితుడు ఆ బాలికను వెంబడించి టాయిలెట్ లోపలికి బలవంతంగా నెట్టి లైంగికంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో బాలికకు ప్రైవేట్ భాగాల నుంచి రక్తస్రావం జరిగింది. కేకలు విన్న తల్లి, తోటి ప్రయాణికులు తలుపు కొట్టడంతో నిందితుడు తప్పించుకోవడానికి ప్రయత్నించి పారిపోయాడు. వెంబడించిన ప్రయాణికులు అతనిని ఎస్1 కోచ్ లో పట్టుకుని డ్యూటీలో ఉన్న టీటీఐకి అప్పగించారు.
అయితే రైలు కడప రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫార్మ్ నెంబర్ మూడుకు చేరుకున్నప్పుడు నిందితుడు రైలు నుంచి దూకి తప్పించుకున్నాడు. ఫిర్యాదుదారుల కంప్లైంట్ మేరకు సికింద్రాబాద్ ఆర్‌పీఎస్‌లో కేసు నమోదు చేసి దానిని కడప ఆర్‌పీఎస్‌కు బదిలీ చేసింది. అప్పటి రైల్వే డీఎస్పీగా ఉండి రిటైర్డ్ అయిన రమేష్ కేసును దర్యాప్తు చేసి అఫిడివేట్ దాఖలు చేశారు. నిందితుడు ప్రసాద్ రెడ్డిని ఫిబ్రవరి 5 2019న అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడికి పంపించారు. అప్పటి నుంచి కేసు విచారణ కొనసాగించిన తర్వాత 2025 డిసెంబర్ మూడో తేదీన నిందితుడికి కడప పోక్సో కోర్టు జీవిత ఖైదును విధించింది. అయితే ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కొంతమంది రైల్వే అధికారులు, అలాగే రైల్వే పోలీసులకు శాఖాపరమైన చర్యలకు మేజిస్ట్రేట్ ఆదేశించారు. కడపలో భద్రతగా అప్పగించాల్సిన నిందితుడిని అజాగ్రత్తగా ఉండడం.. అతడు పారిపోవడం వల్ల.. వారిపై ఈ విధమైన చర్యలకు మేజిస్ట్రేట్ ఆదేశించారు. అలాగే నిందితుడికి జీవిత ఖైదీతో పాటు 10 వేల రూపాయల జరిమానా.. అలాగే బాధిత బాలికకు 1,50,000 గుంతకల్లు డిఆర్ఎం చెల్లించాలని మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.
