AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JC vs Pedda Reddy: మళ్ళీ కాకరేపుతున్న తాడిపత్రి రాజకీయాలు.. ఈ సారి లొల్లి ఎక్కడ మొదలైందంటే!

అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్‌, ఎమ్మెల్యే కేతిరెడ్ది పెద్దారెడ్డి మధ్య మాటలయుద్ధం మరోసారి మొదలైంది. విమర్శలు, ప్రతివిమర్శలతో తాడిపత్రి పాలిటిక్స్‌ హీటెక్కుతున్నాయి. ఇంతకీ.. ఇద్దరి మధ్య వార్‌కు కారణమేంటి?..

JC vs Pedda Reddy: మళ్ళీ కాకరేపుతున్న తాడిపత్రి రాజకీయాలు.. ఈ సారి లొల్లి ఎక్కడ మొదలైందంటే!
Jc Vs Pedda Reddy
Balaraju Goud
|

Updated on: Oct 28, 2023 | 7:10 AM

Share

అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్‌, ఎమ్మెల్యే కేతిరెడ్ది పెద్దారెడ్డి మధ్య మాటలయుద్ధం మరోసారి మొదలైంది. విమర్శలు, ప్రతివిమర్శలతో తాడిపత్రి పాలిటిక్స్‌ హీటెక్కుతున్నాయి. ఇంతకీ.. ఇద్దరి మధ్య వార్‌కు కారణమేంటి?..

జేసీ బ్రదర్స్‌, ఎమ్మెల్యే కేతిరెడ్ది పెద్దారెడ్డి మధ్య ప్రతిసారి ఏదో ఒక విషయంపై తాడిపత్రిలో అధిపత్య పోరు కొనసాగుతూనే ఉంటోంది. తాజాగా.. సాగు, తాగునీరు విషయంలో ఇద్దరి మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా.. HLC కెనాల్‌కు నీళ్లు రావడం లేదని, దాని వల్ల సాగు, తాగు నీటికి ఇబ్బంది అవుతోందని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జలవనరుల శాఖ ఎస్ఈని కలిసిన ఆయన.. HLC కెనాల్‌కు నీళ్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అయితే.. ఎస్‌ఈ నుంచి సరైన సమాధానం లేకపోవడంపై సీరియస్‌ అయ్యారు జేసీ. HLCలో నీరు లేకపోతే ఇసుక అమ్ముకోవచ్చనే ఉద్దేశంతోనే ఇవ్వడంలేదని ఆరోపించారు జేసీ దివాకర్‌రెడ్డి.

జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హెచ్ఎల్సీ కాలువకు నీళ్లు వస్తున్నాయని.. అయినా ఎస్ఈని కలవడం ఎందుకని ప్రశ్నించారు. జేసీ ఆరోగ్యం బాగాలేదని, ఆయన మతిస్థిమితం లేక ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాడిపత్రి అభివృద్ధికి అడ్డుపడేది జేసీ బ్రదర్సేనని ఆరోపించారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.

మొత్తంగా… హెచ్‌ఎల్‌సీ నీటి కేటాయింపుల వ్యవహారం.. తాడిపత్రి రాజకీయాల్లో కాకరేపింది. జేసీ దివాకర్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య వార్‌ హీట్‌ పుట్టిస్తోంది. నీళ్లు ఇవ్వడంలేదని జేసీ ఆరోపిస్తే.. కావాలనే విమర్శలు చేస్తున్నారంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి కౌంటర్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏదేమైనా.. హెచ్‌ఎల్‌సీ వాటర్‌వార్‌ తాడిపత్రిలో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?