Janasena Party: రేపు నేరుగా రాజమండ్రికి పవన్.. ‘శ్రమదానం’ షెడ్యూల్ వివరాలు ఇవే..
Janasena Party: గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘శ్రమదానం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Janasena Party: గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘శ్రమదానం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పవన్ శ్రమదానం కార్యక్రమానికి సంబంధించి షెడ్యూల్ వివరాలను జనసేన నాయకులు కందుల దుర్గేష్ వెల్లడించారు. ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. అక్టోబర్ 2వ తేదీన అంటే రేపు ఉదయం 9 గంటలకు పవన్ కళ్యాణ్ రాజమండ్రికి చేరుకుంటారు. అక్కడ శ్రమదానం కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్నం సమయానికి అనంతపురం వెళ్లనున్నారు. కాటన్ బ్యారేజ్ అద్వాన్నంగా మారిందని, పవన్ రిపేర్ చేస్తానని చెప్పగానే రాత్రికి రాత్రే రోడ్లు వేశారని వైసీపీ ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు. ఈ చర్యతో పవన్ కళ్యాణ్ వస్తే రోడ్లు బాగుపడతాయని తేటతెల్లం అవుతుందన్నారు.
హుకుంపేట నుంచి బాలాజీ పేట రోడ్డు అద్వాన్నంగా మారిందన్నారు. ఆ రోడ్డులో పవన్ కళ్యాణ్ శ్రమదానం చేయనున్నారని దుర్గేష్ పేర్కొన్నారు. అయితే, ఆ విషయం తెలిసుకున్న ప్రభుత్వం.. ఆ రోడ్లకు కూడా మరమ్మతులు చేస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్‌ని చూసి వైసీపీ ప్రభుత్వం వణుకుతోందన్నారు. పవన్ వస్తున్నారని తెలిసి రోడ్లు వేసేస్తున్నారని దుర్గేష్ వ్యాఖ్యానించారు. బయట ప్రాంతాలనుండి వచ్చే జనసైనికులను పోలీసులు అపుతున్నారని, ఎవరు అడ్డుకున్నా పవన్ ప్రోగ్రాం కచ్చితంగా జరిగి తీరుతుందని దుర్గేష్ స్పష్టం చేశారు. రేపటి శ్రమదానం కార్యక్రమంలో.. జన సైనికులతో పాటు వీర మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని దుర్గేష్ తెలిపారు.
Also read:
Anand Mahindra: మరోసారి గొప్ప మనసు చాటుకున్న ఆనంద్ మహీంద్రా.. పేద కుటుంబానికి చేయూత..