Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HanuMan: మారేడుమిల్లి అడవుల్లో చక్కర్లు కొడుతున్న హ‌ను-మాన్‌.. శరవేగంగా షూటింగ్ జరుపుంటున్న తేజ సజ్జ-ప్రశాంత్ వర్మ సినిమా..

HanuMan: స‌రికొత్త‌ కాన్సెప్ట్‌ల‌తో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో క్రియేటివ్ డైరెక్ట‌ర్ ప్రశాంత్ వర్మది ప్రత్యేక శైలి. ప్ర‌స్తుతం మరో సారి ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చూట్టారు

HanuMan: మారేడుమిల్లి అడవుల్లో చక్కర్లు కొడుతున్న హ‌ను-మాన్‌.. శరవేగంగా షూటింగ్ జరుపుంటున్న తేజ సజ్జ-ప్రశాంత్ వర్మ సినిమా..
Hanuman
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 01, 2021 | 9:30 PM

HanuMan: స‌రికొత్త‌ కాన్సెప్ట్‌ల‌తో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో క్రియేటివ్ డైరెక్ట‌ర్ ప్రశాంత్ వర్మది ప్రత్యేక శైలి. ప్ర‌స్తుతం మరో సారి ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చూట్టారు ఆయన. హ‌ను-మాన్ చిత్రం ద్వారా  తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త సినిమాటిక్ జోనర్‌ను పరిచయం చేసేందుకు రెడీ అయ్యారు. మొదటి పాన్-ఇండియన్ సూపర్ హీరో మూవీగా యంగ్‌ హీరో తేజ సజ్జతో క‌లిసి ప్రశాంత్ వర్మ తెర‌కెక్కిస్తోన్న`హను-మాన్`  సినీ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లి, పాడేరులో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలు మ‌రియు పాటల చిత్రీకరణ జ‌రగ‌నుంది. ఈ సంద‌ర్భంగా ఆన్ లొకేష‌న్ స్టిల్ ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. అందులో ప్రశాంత్ వర్మ మరియు తేజ సజ్జ  తీవ్రంగా చ‌ర్చించుకుంటున్నారు. ప్రశాంత్ వర్మ ఒక సన్నివేశాన్ని వివరిస్తుండగా, తేజ అతని మాటలు శ్ర‌ద్ద‌గా వింటున్నారు.

ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన లభించింది.  తేజ సజ్జ సూపర్ హీరో పాత్ర పోషించడానికి స్ట‌న్నింగ్‌ మేక్ఓవర్ అయ్యారు. తేజ గెటప్ చాలా భిన్నంగా ఉంది. జాంబీ రెడ్డి కాంబో మ‌రోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ద‌మైంది. మన పురాణాలు ఇతీహాసల్లో అద్భుతమైన శక్తులు ఉన్న సూపర్‌హీరోస్‌ గురించి మనకు తెలుసు. వారి అపూర్వమైన శక్తులు, బలాలు, పోరాటపటిమ అద్భుతమైనవి. సూపర్ హీరోస్‌ చిత్రాల్లోని హీరో ఎలివేషన్స్, యాక్షన్‌ సీక్వెన్సెస్‌ ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తాయి. అలాగే  సూప‌ర్ హీరో మూవీస్‌ని అన్ని వ‌ర్గాల వారు ఇష్ట‌ప‌డ‌తారు. హ‌ను-మాన్ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో రూపొందుతోంది. శ్రీ‌మ‌తి చైత‌న్య స‌మ‌ర్ప‌ణ‌లో కె. నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్ లో అత్యాధునిక విఎఫ్ఎక్స్ తో ఈ సినిమాను రూపొందిస్తోంది. ప్ర‌ముఖ న‌టీన‌టులు, టాప్-గ్రేడ్ టెక్నీషియన్లు ఈ సినిమా కోసం వ‌ర్క్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో ప్రేమ కథ.. నేటి ఎపిసోడ్‌లో మరింత రొమాన్స్..

Love Story : లవ్ స్టోరీ సక్సెస్ సంబరాలు… మ్యాజికల్ సెలబ్రేషన్స్‌లో చిత్రయూనిట్..

Love Story Magical Celebrations: లవ్ స్టోరీ మ్యాజికల్ సెలబ్రేషన్ లైవ్ వీడియో