AP Corona Updates: ఏపీలో తగ్గుతున్న కరోనా ప్రభావం.. ఆ జిల్లాలో మాత్రం ఇప్పటికీ..
AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో రోజువారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో..
AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో రోజువారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 56,463 సాంపిల్స్ సేకరించి పరీక్షించగా.. 809 మంది కరోనా బారిన పడ్డారు. 1,160 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కోవిడ్ ప్రభావంతో.. గుంటూరు జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కరు చొప్పున మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,142 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,83,50,167 సాంపిల్స్ పరీక్షించగా.. 20,51,133 మందికి కరోనా సోకింది. వీరిలో 20,25,805 మంది కోలుకుని పూర్తి ఆరోగ్యంగా మారారు. కరోనా ప్రభావంతో 14,186 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఉన్న యాక్టీవ్ కేసుల్లో చాలా మంది స్వల్ప లక్షణాలతో ఇంట్లో చికిత్స పొందుతుండగా.. అతికొద్ది మంది మాత్రమే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర వైద్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆ తరువాత అత్యధికంగా చిత్తూరు జిల్లాలో నమోదు అయ్యాయి. ఇక అనంతపురం జిల్లాలో 5, గుంటూరు – 78, కడప – 16, కృష్ణా – 54, కర్నూలు – 2, నెల్లూరు – 115, ప్రకాశం 83, శ్రీకాకుళం – 9, విశాఖపట్నం – 39, విజయనగరం – 1, పశ్చిమ గోదావరి – 93 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Also read:
Telangana: రైతన్నలకు గుండెకోత.. విద్యుత్ తీగలు తెగిపడి నాలుగు గేదెలు మృతి