MLA Arava Sridhar: ఎమ్మెల్యే శ్రీధర్ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్.. జనసేన సంచలన నిర్ణయం.. బాధితురాలు ఏమన్నదంటే..
రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన నాయకుడు అరవ శ్రీధర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలు.. ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. ఓ అమ్మాయితో ఎమ్మెల్యే చనువుగా ఉన్నట్టుగా వీడియోలు వైరల్ కాగా.. ఆ తర్వాత అరవ శ్రీధర్‌పై ఆరోపణలు గుప్పిస్తూ బాధితురాలు విడుదల చేసిన సెల్ఫీ వీడియో మరిన్ని ప్రకంపనలకు కారణమైంది.

రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన నాయకుడు అరవ శ్రీధర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలు.. ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. ఓ అమ్మాయితో ఎమ్మెల్యే చనువుగా ఉన్నట్టుగా వీడియోలు వైరల్ కాగా.. ఆ తర్వాత అరవ శ్రీధర్‌పై ఆరోపణలు గుప్పిస్తూ బాధితురాలు విడుదల చేసిన సెల్ఫీ వీడియో మరిన్ని ప్రకంపనలకు కారణమైంది. ఏడాదిన్నర కాలంగా ఎమ్మెల్యే తనకు నరకం చూపించాడంటూ ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు.. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్టు చెబుతున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని.. ఐదు సార్ల గర్భవతిని చేసి అబార్షన్ చేయించారని.. తీవ్ర ఆరోపణలు గుప్పించింది.. అయితే, ఆరోపణల్ని జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ ఖండించారు. తనను ఆ మహిళే వేధిస్తుందని పేర్కొన్నారు.
ఈ ఘటన పై జనసేన పార్టీ అధిష్టానం స్పందించింది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణకు జనసేన పార్టీ కమిటీని నియమించింది. ‘‘అరవ శ్రీధర్‌పై ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలు, ఒక మహిళ చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ చేయాలని జనసేన కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. దీనిపై ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో టీ. శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, టీసీ. వరుణ్ సభ్యులుగా ఉన్నారు. అరవ శ్రీధర్ ఏడు రోజుల్లోపు కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలి’’. అని జనసేన పార్టీ ఆదేశించింది. ఇక, ఆరోపణలపై నిజా నిజాలు పరిశీలించి.. కమిటీ పార్టీకి నివేదిక అందించనుంది. ఆ నివేదికను పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే వరకు అరవ శ్రీధర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గం స్పష్టం చేసింది.
జనసేన ఎమ్మెల్యే శ్రీధర్‌పై బాధితురాలు కీలక వ్యాఖ్యలు..
జనసేన ఎమ్మెల్యే శ్రీధర్‌పై ఆరోపణలు చేసిన బాధితురాలు మీడియా ముందుకు వచ్చారు. 2024లో ఫేస్‌బుక్‌లో ఎమ్మెల్యేకు తాను మెసేజ్ చేశానని.. ఆ తర్వాత 3 గంటలు తనతో చాటింగ్ చేశారని చెప్పారు బాధితురాలు. తన నెంబర్ అడిగి ఫోన్‌లో మాట్లాడారని.. తర్వాత వీడియో కాల్స్ చేయాలని కోరారని చెప్పారు. 2024 జూలై 9న తనను కారులో బయటకు తీసుకెళ్లారని..కారులో తనను బలవంతం చేయబోయారని ఆరోపించారు బాధితురాలు. తనపై ఎమ్మెల్యే శాడిస్ట్‌లా ప్రవర్తించారన్న బాధితురాలు.. తనకు ఐదు సార్లు అబార్షన్ చేయించారని ఆరోపించారు.
తాను రిలేషన్ వద్దని చెప్పినా కూడా ఎమ్మెల్యే తనను బలవంతం చేశారని..తనతో శాడిస్ట్‌లా ప్రవర్తించావారని ఆరోపించారు. తనకు అండగా ఎవరూ లేకపోవడంతో ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడం వల్లే ఇప్పుడు ఆధారాలతో బయటకు వచ్చానని చెప్పారు. తనకు ఎమ్మెల్యే నుండి ఎలాంటి నష్ట పరిహారం అవసరం లేదని..అతనికి చట్టప్రకారం శిక్ష పడాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే తనతో ఏ విధంగా ప్రవర్తించారన్న దానిపై తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు బాధితురాలు. చివరి సారిగా ఎమ్మెల్యే తనతో జనవరి 7న ఫోన్‌లో మాట్లాడారంటూ ఆ సంభాషణను మీడియాకు వివరించారు బాధితురాలు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
