Mudragada Letter: ముద్రగడ మరోసారి లేఖ.. మండిపడుతున్న జనసేన నేతలు
ఓ వైపు లెటర్ వివాదం కొనసాగుతూ ఉండగానే.. ముద్రగడ పద్మనాభం మరోసారి పవన్ కు మూడు పేజీల లెటర్ ను రాశారు. పవన్ కు ఎక్కడ నుంచి పోటీచేయాలో చెబుతూ ఛాలెంజ్ ను విసిరారు. దీంతో నిప్పు మీద ఉప్పు వేసిన చందంగా జనసేన నేతలు ముద్రగడ పద్మనాభంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చేస్తోన్న వారాహి యాత్రలో భాగంగా కాకినాడలో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర శేఖర్ పై చేసిన కామెంట్స్ ఓ రేంజ్ లో కాకరేపుతున్నాయి. ఇప్పటికే ముద్రగడ పద్మనాభం జనసేనానికి రాసిన లెటర్ పై జనసేన నేతలు, పార్టీ శ్రేణులు విరుచుకుపడుతూనే ఉన్నారు. ఈ వివాదం కొనసాగుతూ ఉండగానే.. ముద్రగడ పద్మనాభం మరోసారి పవన్ కు మూడు పేజీల లెటర్ ను రాశారు. పవన్ కు ఎక్కడ నుంచి పోటీచేయాలో చెబుతూ ఛాలెంజ్ ను విసిరారు. దీంతో నిప్పు మీద ఉప్పు వేసిన చందంగా జనసేన నేతలు ముద్రగడ పద్మనాభంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ముద్రగడ పద్మనాభం మరోసారి లేఖ రాయడంతో.. జనసేన నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు జనసేన పార్టీనీ ఎక్కడ నుండి పోటీ చేయాలో చెప్పడానికి వీళ్ళు ఎవరు ఇలాంటి బొడి లింగాలను చాలామందిని చూసామని.. జనసేన పై కుట్ర జరుగుతుంది అన్నారు పంతం జనసేన నేత నానాజీ.
సోషల్ మీడియా వచ్చిన తరువాత రోజులు మారాయని ముద్రగడ ఇంకా నైన్ టిస్ లోనే ఉన్నారనే విషయం.. ముద్రగడ లేఖలు బట్టి వైసీపీ మనిషి అని అర్దం అవుతుంది అన్నారు జనసేన నేత పంతం నానాజీ. ద్వారంపూడి ఉద్యమాలకు డబ్బులు ఇచ్చారని ముద్రగడ చెప్తున్నారు అందుకే ముద్రగడ దగ్గర తిన్నా ఉప్మా డబ్బులను మనియార్డర్ పంపించామని జనసేన పీఏసీ సభ్యులు పంతం నానాజీ చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..