Pawan Kalyan: చంద్రబాబును అరెస్టు చేస్తారని ఊహించలేదు.. పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్..
Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయవాడకు రావడానికి చేసిన ప్రయత్నాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. పోలీసుల వైఖరికి నిరసనగా పవన్ రోడ్డుపై పడుకొని నిరసన తెలపడంతో హైటెన్షన్ నెలకొంది. పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పవన్.. ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చేందుకు వీసా, పాస్‌పోర్టు కావాలా అని ప్రశ్నించారు.

Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయవాడకు రావడానికి చేసిన ప్రయత్నాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. పోలీసుల వైఖరికి నిరసనగా పవన్ రోడ్డుపై పడుకొని నిరసన తెలపడంతో హైటెన్షన్ నెలకొంది. పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పవన్.. ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చేందుకు వీసా, పాస్‌పోర్టు కావాలా అని ప్రశ్నించారు.
బెయిల్ మీద బయట ఉన్న సీఎం జగన్ జైలు గురించే ఆలోచిస్తారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. చంద్రబాబును పరామర్శించేందుకు వెళుతున్న తనను పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బెయిల్ మీద బయట ఉన్న సీఎం జగన్.. అందర్నీ జైలుకి పంపాలనే ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. క్రిమినల్ చేతిలో అధికారం ఉండడం దురదృష్టకరమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ క్రిమినల్ కాబట్టి అందరూ క్రిమినల్ అవ్వాలని కోరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును అరెస్టు చేస్తారని ముందుగా ఊహించలేదన్నారు. దేశానికి జీ20 ప్రతినిధులు వచ్చినప్పుడు ఇలాంటివి చేయడం ప్రధాని స్ఫూర్తికి మచ్చ అన్నారు పవన్.
విమానానిని అనుమతి నిరాకరణ
అంతకుముందు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయవాడకు రావడానికి చేసిన ప్రయత్నాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు, జనసేన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పవన్ శనివారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే, చివరి నిమిషంలో ఎయిపోర్టు అధికారులు అనుమతి నిరాకరించడంతో వెనుదిరిగారు. పవన్ కల్యాణ్ విజయవాడ వస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని కృష్ణా జిల్లా పోలీసులు ఎయిర్‌పోర్టు అధికారులకు మెయిల్ పంపారు. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు పవన్ విమానానికి అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో పవన్ రోడ్డు మార్గంలో విజయవాడ పయనమయ్యారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ బయల్దేరిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరికి నిరసనగా జనసైనికులు నిరసనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పవన్.. ఏపీలోకి వచ్చేందుకు వీసా, పాస్‌పోర్టు కావాలా అని ప్రశ్నిచారు.
మీ ముఖ్యమంత్రి బాస్ ఒక క్రిమినల్, అతనికి మీరు భయపడతారేమో ! మేము భయపడం – జనసేనాని #HelloAP_ByeByeYCP pic.twitter.com/MiE7Q6Yda6
— JanaSena Party (@JanaSenaParty) September 9, 2023
హైవేపై కాన్వాయ్ ఆపడంతో కోదాడ వైపు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో గరికపాడు వద్ద పవన్ కాన్వాయ్‌ను వదిలేసిన పోలీసులు మరోసారి అనుమంచిపల్లి వద్ద అడ్డుకున్నారు. దీంతో పవన్ వాహనం దిగి జాతీయ రహదారిపై నడుచుకుంటూ ముందుకు సాగారు. పోలీసులు అప్రమత్తమై ఆయన్ను అక్కడే బలవంతంగా నిలువరించారు. పోలీసుల తీరుకు నిరసనగా పవన్ జాతీయ రహదారిపై పడుకొని నిరసన తెలిపారు. దీంతో కాసేపు హైడ్రామ నడిచింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ వాహనంను ముందుకెళ్లేందుకు అనుమతించిన పోలీసులు.. మళ్లీ పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో జనసేన నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అయితే కాసేపట్టి తర్వాత పవన్‌ను విజయవాడకు తరలించారు పోలీసులు.
పవన్ కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకోవడాన్ని లోకేశ్ తీవ్రంగా ఖండించారు. పోలీసులే అల్లరి మూకల మాదిరిగా చేయడం దారుణమన్నారు. రాజకీయ నేతలని అక్రమంగా నిర్భందించడం రాజ్యాంగా విరుద్ధమని మండిపడ్డారు. పోలీసుల తీరుతో ఏపీలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని విరుచుకుపడ్డారు లోకేశ్. ఏపీలో పరిస్థితులు ఎమర్జెన్సీ కంటే ఘోరంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్రిమినల్ కి అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది – శ్రీ పవన్ కళ్యాణ్ గారు
ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి కొద్దిసేపటి ముందు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనుమంచిపల్లి దగ్గర మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు..
•శ్రీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేస్తారని మేమేమీ…
— JanaSena Party (@JanaSenaParty) September 9, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
