Pawan Kalyan – MK Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమిళనాడు సీఎం స్టాలిన్‌కి శుభాభినందనలు తెలిపారు. "ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావటానికి రాజకీయం చెయ్యాలి కానీ

Pawan Kalyan - MK Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
Pawan Stalin
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 01, 2021 | 7:06 AM

Pawankalyan – MK Stalin: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమిళనాడు సీఎం స్టాలిన్‌కి శుభాభినందనలు తెలిపారు. “ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావటానికి రాజకీయం చెయ్యాలి కానీ.. ప్రభుత్వంలోకి వచ్చాక రాజకీయం చెయ్యకూడదు. దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, మీ ప్రభుత్వ పని తీరు మీ ఒక్క రాష్ట్రానికే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అన్ని రాజకీయ పార్టీలకు మార్గదర్శకం… స్ఫూర్తిదాయకం. మీకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియచేస్తున్నాను. మీకు నా శుభాకాంక్షలు.” అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కితాబిచ్చారు.

ఇలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై జనసేన పార్టీ మళ్లీ పోరాటానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నరకాన్ని తలపిస్తున్న రోడ్ల మరమ్మతుల కోసం జనసేన పోరాటానికి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాడైపోయిన రహదారుల మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో ఉద్యమం చేయాలని నిర్ణయించింది జనసేన పార్టీ. ఈ విషయాన్ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ జెండా స్థూపం నిరసన కొనసాగుతోంది. నిడదవోలు మండలం కాటకోటేశ్వరంలో జనసేన పార్టీ జెండా స్థూపం నిర్మాణాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వైకాపా వారే కావాలని అడ్డుకుంటున్నారని జనసేన నాయకులు ఆందోళన చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజున ఈ స్థూపం ప్రారంభం చేయాలనుకున్న జనసేన నేతలకు పోలీసుల చర్యతో ఆటంకం ఏర్పడింది. కాటకూటేశ్వరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జనసేన స్తూపం నిర్మాణ పనుల్లో ఉన్న ఆ పార్టీ కార్యకర్తలను అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టారంటూ పోలీసులు అడ్డుకున్నారు.

అనంతరం ఆర్‌అండ్‌బి, పంచాయతీ అధికారులు జనసేన పార్టీ జెండా స్థూప నిర్మాణాన్ని నిలిపివేశారు. దీంతో అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో జనసేన స్తూపాన్ని అడ్డుకునేందుకు పోలీసులు రంగంలో దిగారని జనసేన కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. నియోజకవర్గంలో ఇతర పార్టీ జెండా స్థూపాలకి ఎలా అనుమతులు ఉన్నాయో చెప్పాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

Read also: 40 floor towers: 40 ఫ్లోర్స్.. నువ్వా నేనా అనేట్టు రెండు టవర్స్‌. మొత్తం 900 ప్లాట్స్. కానీ కూల్చేస్తున్నారు.. ఏమా కథ.?