Pawan Kalyan: ప్రజలపై పన్నులు, మద్యం ఆదాయం తాకట్టుతో అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదు: పవన్ కల్యాణ్
Pawan Kalyan: ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి మండిపడ్డారు. ప్రజలపై పన్నులు, మద్యం ఆదాయం తాకట్టుతో అప్పుల చేసే సుపరిపాలన..
Pawan Kalyan: ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి మండిపడ్డారు. ప్రజలపై పన్నులు, మద్యం ఆదాయం తాకట్టుతో అప్పుల చేసే సుపరిపాలన కాదని అన్నారు. సంక్షేమం అస్సలే కాదు.. నేటి ‘నవ రత్నాలు’ భావితరాలుకు ‘నవ కష్టాలు.’ అంటూ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.
కాగా, నిన్న పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్రంలో దూమారం రేపుతోంది. పవన్ వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ కావాలని అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. పవన్ మాటలు జగన్ మీద విషం చిమ్మెలా ఉన్నాయని పేర్కొన్నారు.
#SaveAPfromYSRCP ప్రజలు మీద పనులు రుద్ది, మద్యం ఆదాయం తాకట్టుతొ అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదు, సంక్షేమం అస్సలే కాదు. నేటి ‘నవ రత్నాలు’ భావితరాలుకు ‘నవ కష్టాలు.’ pic.twitter.com/dax6s7EAak
— Pawan Kalyan (@PawanKalyan) September 26, 2021
ఇవీ కూడా చదవండి: