AP News: ఆ చర్చి నిర్మాణం జరిగి 118 ఏళ్లు పూర్తి.. ఎక్కడో తెలుసా..?
క్రిస్మస్ పర్వదినం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపంలోని పురాతనమైన సిఎస్ఐ చర్చి నిర్మించి 118 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్ల మధ్య క్రిస్మస్ సంబరాలు నిర్వహించారు. క్రిస్మస్ పండగ సందర్భంగా వేలాది మంది చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్నారు. విద్యుత్ కాంతుల మద్య చర్చి అత్యంత శోభయమానంగా..
ఏదైనా ఒక నిర్మాణం జరిగితే రెండు దశాబ్దాలకి మరమ్మతులు వస్తుంటాయి 50 ఏళ్లకు పూర్తిగా శిథిలమవుతున్న పరిస్థితి ఉంది అలాంటిది ఆ చర్చి నిర్మాణం జరిగి నేటికీ సరిగ్గా 118 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అక్కడి స్థానికులు ప్రత్యేక ప్రార్థనలు జరిపి క్రీస్తు జన్మదిన క్రిస్మస్ సందర్భంగా జరుపుకున్న సంబరాలు ఆకాశాన్ని తాకాయి.
నంద్యాల జిల్లాలో క్రిస్మస్ పర్వదినం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపంలోని పురాతనమైన సిఎస్ఐ చర్చి నిర్మించి 118 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్ల మధ్య క్రిస్మస్ సంబరాలు నిర్వహించారు. క్రిస్మస్ పండగ సందర్భంగా వేలాది మంది చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్నారు. విద్యుత్ కాంతుల మద్య చర్చి అత్యంత శోభయమానంగా కనులవిందు చేసింది. చర్చిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.
రాయలసీమ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన చర్చిలలో నంద్యాల సిఎస్ఐ చర్చి ఒక్కటిగా పేరుగాంచింది. 118 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎంతో ప్రాముఖ్యమైన చర్చిగా ప్రసిద్ధ చెందింది. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డయాసిస్ ఆఫ్ నంద్యాల అధ్యక్ష ఖండం ఆధ్వర్యంలో ఈ చర్చ్ నిర్వహణ జరుగుతుంది. క్రిస్మస్ పండుగ రోజు వేల సంఖ్యలో ప్రార్థనల్లో పాల్గొననున్న. చర్చిలో జరిగిన ప్రార్థనలో స్థానిక ఎమ్మెల్యే శిల్పారవి, ఎమ్మెల్సీ ఇసాక్ భాషా తదితరులు పాల్గొని క్రైస్తవ సోదర సోదరిమణులకు శుభాకాంక్షలు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి