తిరుమ‌ల‌ను ద‌ర్శించుకున్న ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు.. రేపు నింగిలోకి దూసుకెళ్ల‌నున్న పీఎస్ఎల్వీ సీ 50

తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలుదర్శించుకున్నారు. శ్రీవారి చెంత పీఎస్ఎల్వీ సీ 50 నమూనా రాకెట్ కు పూజలు నిర్వహించారు. రేపు సాయంత్రం 3:41 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహ‌రికోటలో...

తిరుమ‌ల‌ను ద‌ర్శించుకున్న ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు.. రేపు నింగిలోకి దూసుకెళ్ల‌నున్న పీఎస్ఎల్వీ సీ 50
Follow us
Anil kumar poka

|

Updated on: Dec 16, 2020 | 9:23 AM

తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలుదర్శించుకున్నారు. శ్రీవారి చెంత పీఎస్ఎల్వీ సీ 50 నమూనా రాకెట్ కు పూజలు నిర్వహించారు. రేపు సాయంత్రం 3:41 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహ‌రికోటలోని స‌తీష్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్ రెండో ప్ర‌యోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ 50 రాకెట్ నింగిలోకి దూసుకుపోనుంది. కమ్యూనికేషన్ శాటిలైట్ సీఎంఎస్-01ను నింగిలోకి పంపనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. అయితే ఈ ప్రయోగం విజయవంతం కావాలని అర్చకులు ఆశీర్వచనం చేశారు. గురువారం మధ్యాహ్నం పీఎస్ఎల్వీ సీ50 కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది.

కాగా, అత్యాధునిక సాంకేతిక సమాచారాన్ని సత్వరం అందుబాటులోకి తెచ్చేందకు ఇస్రో సాగించే నిరంతర ప్రక్రియ మరింత వేగవంతమైంది. షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈనెల 17న సాయంత్రం 3:41 గంటలకు పీఎస్‌ఎల్‌వీ – సీ50 ఉపగ్రహ వాహకనౌకను ప్ర‌యోగించ‌నున్నారు. 1,410 కిలోల బరువు కలిగిన సీఎంఎస్‌–01 (జీశాట్‌–12ఆర్‌) అనే సరికొత్త కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు ఇస్రో అధికారులు. భార‌త‌దేశ‌పు 42వ క‌మ్యూనికేష‌న్ ఉప్రగ‌హం.. సీఎంఎస్-01 ఫ్రీక్వెన్సీ స్పెక్ర్టంలో విస్తరించిన సీ బ్యాండ్ సేవ‌ల‌ను అందించేందుకు నిర్దేశించారు. దీని ప‌రిమితి భార‌త్‌తో పాటు అండ‌మాన్ నికోబార్ దీవులు, లక్ష్యదీప్‌ల‌కు విస్తరిస్తుంది. పీఎస్ఎల్వీ సీ-50 ఎక్స్ఎల్ సిరీస్‌‌లో ఇది 22వది అని ఇస్రో తెలిపింది. అంతేకాకుండా షార్ నుంచి ఇది 77వ మిష‌న్ అని వెల్లడించింది.