పశువులను చంపేస్తూ సంచరిస్తున్న వింత జంతువును బావిలో గుర్తించిన తూర్పుగోదావరి జిల్లా రైతులు.!
తూర్పుగోదావరి జిల్లా అలమూరు, కపిలేశ్వరపురం మండలాల్లో ఇటీవల కాలంలో పశువులను చంపేస్తూ సంచరిస్తున్న వింత జంతువును రైతులు గుర్తించారు...
తూర్పుగోదావరి జిల్లా అలమూరు, కపిలేశ్వరపురం మండలాల్లో ఇటీవల కాలంలో పశువులను చంపేస్తూ సంచరిస్తున్న వింత జంతువును రైతులు గుర్తించారు. ఆలమూరు మండలం జొన్నాడ – పెనికేరుకు మధ్యలో ఓ జామతోటలో గల పాడుపడ్డ నూతిలో ఈ హంతకి ఉన్నట్లు గుర్తించిన రైతులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బావిలో నుండి పైకి చూస్తూ… జనాల్ని చూసి లోపలికి వెళ్లిపోతోందని ఆ ప్రాంత రైతులు చెబుతున్నారు.