Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP – TG CM Meet: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై ఏపీ మాజీ మంత్రుల ఆసక్తికర కామెంట్స్..!

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇవాళ బిగ్‌డే. రెండు రాష్ట్రాలు విడిపోయి పదేళ్లు పూర్తయింది. అయినా విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. చిక్కుముడులు వీడలేదు. కానీ రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇవాళ భేటీ అవుతున్నారు.

AP - TG CM Meet: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై ఏపీ మాజీ మంత్రుల ఆసక్తికర కామెంట్స్..!
Botsa Satyanarayana, Perni Nani
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 06, 2024 | 4:53 PM

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇవాళ బిగ్‌డే. రెండు రాష్ట్రాలు విడిపోయి పదేళ్లు పూర్తయింది. అయినా విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. చిక్కుముడులు వీడలేదు. కానీ రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇవాళ భేటీ అవుతున్నారు.

విభజన సమస్యలపై ఇప్పటివరకు 31సార్లు చర్చలు జరిగాయి. కేంద్ర హోంశాఖే ఇరు రాష్ట్రాలతో చర్చలు జరిపింది. గతంలోనూ రెండుసార్లు ముఖ్యమంత్రుల ములాఖత్ అయ్యారు. కానీ, విభజన సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. ఎక్కడి వేసిన గొంగళి అన్నట్టే మిగిలిపోయింది. ఆస్తులు-అప్పులపైనే ఇప్పటికీ గందరగోళం కొనసాగుతోంది. ఉమ్మడి ఆస్తులపై సుప్రీం, హైకోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. ప్రధానంగా పది, తొమ్మిదో షెడ్యూల్‌లోని సంస్థలపైనే వివాదం నడుస్తోంది. దాంతో, వీటిపైనే ప్రధానంగా ఫోకస్‌ పెట్టనున్నారు ఇరువురు ముఖ్యమంత్రులు.

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో మంత్రులు పేర్ని నాని, బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ భేటీపై పారదర్శత కోసం, ప్రజలకు వాస్తవాలు తెలియడానికి సీఎంల సమావేశం ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరారు. అయితే, మాజీ మంత్రి పేర్ని నాని ఇద్దరు సీఎంల భేటీపై వ్యంగ్యంగా స్పందించారు. మరోసారి తెలుగు రాష్ట్రాలు ఏకం కాబోతున్నాయా అన్నట్లు కామెంట్ చేశారు. ఈ మేరకు ట్విటర్ ఎక్స్ వేదికగా ఇలా రాసుకొచ్చారు. తెలుగు న్యూస్ ఛానళ్ళ బ్రేకింగ్ వార్తలు చూస్తుంటే, నేటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఇద్దరి డిమాండ్లు తీరాలంటే, రెండు రాష్ట్రాల పునరేకీకరణయే ఏకైక మార్గం కనపడుతోందంటూ పేర్ని నాని పేర్కొన్నారు.

ఇక, మరో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ట్విట్టర్‌ వేదికగా..‘విభజన సమస్యల పరిష్కారానికి నేడు రెండు రాష్ట్రాల సీఎంల సమావేశం నేపథ్యంలో పోర్టుల్లో, టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటాలు కోరుతున్నట్టుగా వస్తున్న వార్తలు ఏపీ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు.

మరోవైపు ఇప్పటికే ప్రధానంగా పది అంశాలతో అజెండాను ఫిక్స్‌ చేసుకున్నాయి తెలుగు రాష్ట్రాలు. పదేళ్లుగా పరిష్కారంకాని సమస్యలపైనే ఫోకస్‌ పెట్టబోతున్నారు చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి. మరి, ఈసారైనా విభజన సమస్యలు కొలిక్కి వస్తాయా? లేదా? వేచి చూడాలి..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…