ప్రజాభవన్‌కు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ ఉత్కంఠ రేపుతోంది. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా, విభజన చట్టంలోని చాలా సమస్యలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, వీటి పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల సీఎంలు చొరవ తీసుకుని ఓ అడుగు ముందుకేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ ఉత్కంఠ రేపుతోంది. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా, విభజన చట్టంలోని చాలా సమస్యలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, వీటి పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల సీఎంలు చొరవ తీసుకుని ఓ అడుగు ముందుకేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగే చర్చపై ఆసక్తి నెలకొంది. విభజన సమస్యల పరిష్కారానికి ఎలాంటి రోడ్ మ్యాప్ ఖరారవుతుందో వేచి చూడాలి.
ప్రజాభవన్‌లో జరిగే ముఖ్యమంత్రుల సమావేశానికి తెలంగాణ తరపున డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మరో ఇద్దరు అధికారులు హాజరు అవుతున్నారు. అటు ఏపీ నుంచి మంత్రులు అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, బీసీ జనార్థన్ రెడ్డి తోపాటు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్, ఉన్నతాధికారులు రవిచంద్ర, కార్తికేయ మిశ్రా హాజరుఅవుతున్నారు.
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

