Andhra Pradesh: అదృష్టం అంటే వీరిదే.. రైలు ఢీకొట్టినా ప్రాణాలతో బయటపడ్డారు..!
Andhra Pradesh: ఒక్కొక్కసారి ఊహించని అద్భుతాలు జరుగుతుంటాయి. అవి ఎలా ఉంటాయంటే ఊహించని స్థాయిలో ఉంటాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాసలో అలాంటి అద్భుతమే జరిగింది.
Andhra Pradesh: ఒక్కొక్కసారి ఊహించని అద్భుతాలు జరుగుతుంటాయి. అవి ఎలా ఉంటాయంటే ఊహించని స్థాయిలో ఉంటాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాసలో అలాంటి అద్భుతమే జరిగింది. అదృష్టమంటే వీరిదే అనుకునేలా.. రైలు ఢీకొన్న ప్రణాలతో బయటపడ్డారు. ఈ అరుదైన ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎంతో మంది ప్రాణాలను కాపాడే 108 వాహన సిబ్బంది కే ప్రాణాపాయం తప్పింది. వారు చేసిన సేవలే వారి ప్రాణాలను కాపాడాయి అనడానికి ఈ ఘటన ఓ తార్కాణంగా చెప్పక తప్పదు.
వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా, పలాస రైల్వే స్టేషన్‌లో 108 వాహనాన్ని రైలు ఢీ కొంది. ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలుకు ఓ పేషెంట్‌ను తీసుకువస్తున్న క్రమంలో ఆ రైలు 108 వాహనాన్ని ఢీ కొంది. అయితే తృటిలో ప్రమాదం తప్పింది. రైలు ఢీ కొడుతుంది అన్న విషయాన్ని 108 సిబ్బంది ముందుగానే గుర్తించి బయటకు దూకేయడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదము జరగలేదు. ప్రాణాలతో బయట పడ్డామని ఊపిరి పీల్చుకున్నారు 108 అంబులెన్స్ సిబ్బంది. కాగా, సుమారు వందమీటర్లు మేర 108 అంబులెన్స్ ను ఈడ్చుకెల్లింది రైలు. ఈ ప్రమాదంతో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు పలాస రైల్వే స్టేషన్లో నిలిచిపొయింది.
Also read:
శీతాకాలంలో నైట్ క్రీమ్ కోసం డబ్బు వృధా చేస్తున్నారా..! దీనికంటే మంచిది మరొకటి ఉండదు..
Bike Loan: లోన్ తీసుకొని బైక్ కొంటున్నారా..! ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..
Car prices: జనవరిలో కార్ల ధరలు మళ్లీ పెరిగే అవకాశం.. కంపెనీలు ఏం చెబుతున్నాయంటే..?