Andhra Pradesh: ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాంకు ఐటీ శాఖ నోటీసులు.. ఆ విషయంలో 17లోగా వివరణ ఇవ్వాలని..
ఏపీ రాజకీయాల్లో ఇన్‌కమ్ టాక్స్ నోటీసులు కలకలం రేపాయి. మంత్రి గుమ్మనూరు జయరాంతో పాటుగా ఆయన భార్య రేణుకమ్మకు ఐటీ నోటీసులు జారీ చేసింది.
ఏపీ రాజకీయాల్లో ఇన్‌కమ్ టాక్స్ నోటీసులు కలకలం రేపాయి. మంత్రి గుమ్మనూరు జయరాంతో పాటుగా ఆయన భార్య రేణుకమ్మకు ఐటీ నోటీసులు జారీ చేసింది. జయరాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలూరు నియోజకవర్గంలోని చిన్న హోతూరు, ఆస్పరి గ్రామాల పరిధిలో ఇట్టిన కంపెనీకి 443 ఎకరాలు భూములున్నాయి. వీటిని కంపెనీ డైరెక్టర్ మంజునాథ్ సహకారంతో మంత్రి తన కుటుంబసభ్యుల పేర్ల మీదకు బదలాయించుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో అనేక అవకతవకలున్నట్లు ఐటీ అనుమానిస్తోంది. వాటిపై వివరణ ఇవ్వాలని ఐటీ శాఖ మంత్రిని అడిగింది.
ఇట్టిన అనే కంపెనీ భూముల కొనుగోలులో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. ఆ భూములు ఎవరికీ బదిలీ చెయ్యొద్దని ఐటీ అధికారులు సబ్‌రిజిస్ట్రార్‌కూ ఆదేశాలిచ్చారు. ఈ వ్యవహారంపై ఈనెల 17లోగా వివరణ ఇవ్వాలని మంత్రిని ఐటీ నోటీసుల్లో పేర్కొంది.
గత నెల 14 ఫిబ్రవరి 2023న ఐటీ శాఖనోటీసులు జారీ చేసింది. 2019లో అఫిడవిట్లో భార్య పేరిట ఎలాంటి ఆస్తులు చూపని గుమ్మనూరు.. 2020లో భార్య పేరులో 30 ఎకరాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో గుమ్మనూరుకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..