Video: పశ్చిమ ఏజెన్సీలో పులి భయం.. ఒంటరిగా వెళ్లేందుకు జంకుతోన్న జనం..
ఇక బుట్టాయిగూడెం మండలం ముంజలూరు శివారు అటవీ ప్రాంతంలో నిన్న ఓ ఆవుపై గుర్తు తెలియని జంతువు దాడి చేసి చంపి దాని శరీరంలో సగభాగం తినేసింది. అదే ప్రాంతంలో నాలుగు రోజుల క్రితం జంతువు దాడిలో ఓ దూడ మృతి చెందింది. అయితే, పులే వాటిపై దాడి చేసి అక్కడి నుంచి బుట్టాయిగూడెం కొయ్యలగూడెం మండల పరిసర ప్రాంతాల్లో తిరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే అధికారులు పులి పాదముద్రలు గుర్తించిన ప్రదేశాలలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి పులి సంచారాన్ని కనిపెట్టాలని కోరుతున్నారు.
Andhra Pradesh: ఏలూరు జిల్లా ఏజెన్సీలో పులి భయంతో స్థానికులు వణికి పోతున్నారు. అదిగో పులి అంటే ఇదిగో పులి అనే విధంగా ఇక్కడ పరిస్థితి తయారయింది. గుర్తుతెలియని జంతువు పాదముద్రలు స్థానికులు గుర్తించడంతో.. అవి పులివేనంటూ ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా తమ పంట పొలాల్లోకి వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లాలంటేనే భయపడుతూ ఇంటి వద్దనే కాలం వెళ్లదీస్తున్నారు. అధికారులు సైతం పాదముద్రలు ఏ జంతువువని కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. అంతేకాకుండా ఓ జంతువు దాడిలో నాలుగు రోజుల వ్యవధిలో ఒక ఆవు, దూడ మృతి చెందడంతో మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం కొయ్యలగూడెం మండలాల్లో పులి సంచారం తీవ్ర కలకలం రేపుతుంది. ఇటీవల వారం రోజుల వ్యవధిలో బుట్టాయిగూడెం మండలంలో ఎర్రాయిగూడెం గ్రామ శివారు తోటల్లో గుర్తుతెలియని జంతువు పాదముద్రలను స్థానికులు గుర్తించారు. అవి ఇంచుమించుగా పులి పాద ముద్రలను పోలి ఉండడంతో తమ ప్రాంతంలో పులి సంచరిస్తుందంటూ స్థానికులు భయపడుతున్నారు. వెంటనే సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు అందించారు. అయితే అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ప్లాస్టర్ అఫ్ ప్యారిస్తో ఆ పాదముద్రలను సేకరించి వైల్డ్ లైఫ్ లేబరేటరీకి జంతువు నిర్ధారణ కోసం పంపించారు.
ఇక కొయ్యలగూడెం మండలం దిప్పకాయలపాడు, కొత్తూరు ఆర్ అండ్ ఆర్ కాలనీ సమీపంలోని పొగాకు వేరుసేనగ తోటలలో సైతం పులి పాదముద్రలు పోలివున్న పాదముద్రలను రైతులు గుర్తించారు. అధికారులు స్పందించి వెంటనే ఆ పాదముద్రలు కలిగిన జంతువుని బంధించాలని, పులి భయంతో పంట పొలాల్లో పనులకు రావడానికి సైతం కూలీలు నిరాకరిస్తున్నారంటూ రైతులు వాపోతున్నారు.
ఇక బుట్టాయిగూడెం మండలం ముంజలూరు శివారు అటవీ ప్రాంతంలో నిన్న ఓ ఆవుపై గుర్తు తెలియని జంతువు దాడి చేసి చంపి దాని శరీరంలో సగభాగం తినేసింది. అదే ప్రాంతంలో నాలుగు రోజుల క్రితం జంతువు దాడిలో ఓ దూడ మృతి చెందింది. అయితే, పులే వాటిపై దాడి చేసి అక్కడి నుంచి బుట్టాయిగూడెం కొయ్యలగూడెం మండల పరిసర ప్రాంతాల్లో తిరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే అధికారులు పులి పాదముద్రలు గుర్తించిన ప్రదేశాలలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి పులి సంచారాన్ని కనిపెట్టాలని కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..