Viral: సముద్రం అడుగున రామచంద్రుడు.! విశాఖ బీచ్ వద్ద అబ్బురపరిచిన దృశ్యం.
జనవరి 22 సోమవారం యావత్ భారతదేశం మనసు, చూపు అయోధ్యవైపే ఉంది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఊరూవాడా రామనామకీర్తనలతో మార్మోగింది. పలువురు తమదైనశైలిలో రామునిపై భక్తిని చాటుకున్నారు. ఈ క్రమంలో విశాఖకు చెందిన స్కూబా డైవర్లు అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సముద్ర గర్భంలో రాముని చిత్రపటాన్ని ప్రతిష్ఠించి తమ భక్తిని చాటుకున్నారు. సోమవారం రిషికొండ బీచ్‌లో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.
జనవరి 22 సోమవారం యావత్ భారతదేశం మనసు, చూపు అయోధ్యవైపే ఉంది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఊరూవాడా రామనామకీర్తనలతో మార్మోగింది. పలువురు తమదైనశైలిలో రామునిపై భక్తిని చాటుకున్నారు. ఈ క్రమంలో విశాఖకు చెందిన స్కూబా డైవర్లు అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సముద్ర గర్భంలో రాముని చిత్రపటాన్ని ప్రతిష్ఠించి తమ భక్తిని చాటుకున్నారు. సోమవారం రిషికొండ బీచ్‌లో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సముద్రంలో 22 అడుగుల లోతున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాముడిపై హిందువులకు ఉండే బలమైన విశ్వాసానికి, సంప్రదాయానికి ఈ కార్యక్రమం చిహ్నమని స్కూబా డైవర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐదుగురు స్కూబా డైవర్లు పాలుపంచుకున్నట్టు లివిన్ అడ్వెంచర్స్ స్కూబా డైవింగ్ ఫ్రాంటియర్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ నాయుడు తెలిపారు. ఫోమ్ బోర్డుపై ఏర్పాటు చేసిన రాముడి చిత్రంపటంతో ఈ కార్యక్రమం నిర్వహించామని, చిత్రపటంపై పూల రేకులు, ఆక్సిజన్ బబుల్స్ కురిపించామని చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

