APPSC Group 1 Application Last Date: ఏపీ నిరుద్యోగులకు అలర్ట్.. ఏపీపీఎస్సీ గ్రూప్ -1 ఆన్‌లైన్ దరఖాస్తు గడువు పెంపు! ఎప్పటివరకంటే
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ -1 అభ్యర్థులకు దరఖాస్తు గడువును పెంచుతున్నట్లు ఏపీపీఎస్సీ తాజాగా ప్రకటించింది. ముందుగా ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం జనవరి 21తో దరఖాస్తుకు తుది గడువు ముగియనుంది. అయితే తాజాగా అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు జనవరి 28వ తేదీవరకు దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. కాగా డిసెంబర్‌లో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల అయిన సంగతి తెలిసిందే..
అమరావతి, జనవరి 24: ఆంధ్రప్రదేశ్ గ్రూప్ -1 అభ్యర్థులకు దరఖాస్తు గడువును పెంచుతున్నట్లు ఏపీపీఎస్సీ తాజాగా ప్రకటించింది. ముందుగా ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం జనవరి 21తో దరఖాస్తుకు తుది గడువు ముగియనుంది. అయితే తాజాగా అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు జనవరి 28వ తేదీవరకు దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. కాగా డిసెంబర్‌లో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల అయిన సంగతి తెలిసిందే. మొత్తం 81 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటన జారీ చేసింది. వాటిల్లో డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 9, ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ 18, డీఎస్పీ (సివిల్) పోస్టులు 26, రీజనల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్ పోస్టులు 6, కోఆపరేటివ్ సర్వీసెస్‌లో డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు 5, జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ పోస్టులు 4 వరకు ఉన్నాయి.
వీటితోపాటు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి పోస్టులు 3, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు 1, అసిస్టెంట్ అకౌంట్స్ అధికారి పోస్టులు 3, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు 2, జైళ్ల శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు 1, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు 1, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ -2 పోస్టులు 1, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు 1 ఉన్నాయి. వీటన్నింటినీ నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్ష ఆఫ్‌లైన్ మోడ్‌లో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మెయిన్ పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో జరుగుతుంది. అయితే కమిషన్ మెయిన్స్ తేదీని ఇంకా ఖరారు చేయలేదు.
తెలంగాణ ప్రవేశ పరీక్షలకు త్వరలోనే కన్వీనర్ల నియామకం
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఏడు ప్రవేశ పరీక్షల టైం టేబుల్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. వీటిల్లో కొన్నింటికి కొత్త కన్వీనర్లను నియమించనున్నారు. గత ఏడాది ఎడ్‌సెట్ కన్వీనర్‌గా పనిచేసిన ఓయూ విద్యా విభాగం ప్రొఫెసర్ రామకృష్ణ పదవీ విరమణ పొందారు. దీంతో ఆయన స్థానంలో కొత్త వారిని నియమించాల్సి ఉంది. నిబంధనల ప్రకారం ప్రొఫెసర్ స్థాయి వారినే కన్వీనర్‌గా నియమించాలి. ప్రస్తుతం ఓయూలో ఇద్దరే ప్రొఫెసర్లు ఉన్నారు. వారిలో ఒకరిని నియమించనున్నారు.
ఐసెట్ మేమే నిర్వహిస్తామంటోన్న మహాత్మాగాంధీ యూనివర్సిటీ
మేనేజ్‌మెంట్ విభాగంతో తమకు ఎంసీఏ కోర్సు కూడా ఉందని, ఈ సారి ఐసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యతలు తమకు అప్పగించాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ కోరుతోంది. మరోవైపు అంబేడ్కర్ సార్వత్రిక యూనివర్సిటీ కూడా ఐసెట్ నిర్వహిస్తామని కోరుతున్నట్లు సమాచారం. గతేడాది ఐసెట్‌ను కాకతీయ యూనివర్సిటీ నిర్వహించింది. చివరకు ఎవరు నిర్వహిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం విద్యాశాఖ సీఎం రేవంత్‌రెడ్డి వద్దనే ఉన్నందున ఎంసెట్ పేరు మార్పు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. ఆ తర్వాతే కన్వీనర్లు, ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటిస్తామని చెబుతున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.