JEE Main 2024 Session 1 Exam: నేటి నుంచే జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు.. విద్యార్ధులూ ఈ జాగ్రత్తలు తప్పనిసరి

దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నేటి నుంచి జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల చొప్పున పరీక్షలు జరుగుతాయి. పేపర్‌ 1, పేపర్ 2 పరీక్షలు జనవరి 24, 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరుగుతాయి. మొదటి షిఫ్ట్‌ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. సెకండ్ షిఫ్ట్‌ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. దేశ వ్యాప్తంగా దాదాపు 12.30లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు..

JEE Main 2024 Session 1 Exam: నేటి నుంచే జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు.. విద్యార్ధులూ ఈ జాగ్రత్తలు తప్పనిసరి
JEE Main 2024
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 24, 2024 | 6:38 AM

ఢిల్లీ, జనవరి 24: దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నేటి నుంచి జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల చొప్పున పరీక్షలు జరుగుతాయి. పేపర్‌ 1, పేపర్ 2 పరీక్షలు జనవరి 24, 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరుగుతాయి. మొదటి షిఫ్ట్‌ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. సెకండ్ షిఫ్ట్‌ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. దేశ వ్యాప్తంగా దాదాపు 12.30లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2.5 లక్షల మందికి పైగా విద్యార్ధులు పరీక్ష రాస్తున్నారు. జేఈఈ మెయిన్‌ పరీక్షకు గతేడాది కన్నా ఈసారి రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే.

దేశవ్యాప్తంగా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో నిర్వహించే జేఈఈ మెయిన్స్‌, బీఆర్క్‌ మొదటి విడత-2024 పరీక్షలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు సమకూర్చామని అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలి సూచించారు. ఉదయం 8.30, మధ్యాహ్నం 2.30 గంటల వరకు పరీక్ష కేంద్రాల గేట్లు మూసేస్తారు. పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే విద్యార్థులు చేరుకోవాలి. ప్రభుత్వ గుర్తింపు కార్డు లేదా ఆధార్‌తో వేలిముద్ర అనుసంధానమై ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే విద్యార్థి పరీక్ష రాసే చోటు తెలుస్తుంది. ఇలా చేయడం వల్ల ఒక విద్యార్ధికి బదులు వేరేవారు పరీక్షలు రాసే అవకాశమే ఉండదంటున్నారు అధికారులు.

ఇవి కూడా చదవండి

పరీక్ష కేంద్రాలకు ఏమేం తీసుకువెళ్లాలంటే..

  • అడ్మిట్‌ కార్డులో సూచించిన సమయానికి విద్యార్ధులు తప్పనిసరిగా పరీక్ష రాసే ప్రదేశానికి చేరుకోవాలి.
  • ఆధార్‌ / పాస్‌పోర్టు / రేషన్‌కార్డు / ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డుతోపాటు రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు, ట్రాన్స్‌పరెంట్‌ పెన్‌, అడ్మిట్‌ కార్డు, బీఆర్క్‌ పరీక్షకైతే పెన్సిల్‌, స్కేల్‌, రబ్బర్‌, జామెంట్రీ బాక్స్‌, వాటర్‌ బాటిల్‌ పరీక్ష హాలులోకి విద్యార్ధులు వెంట తీసుకెళ్లాలి.
  • పరీక్ష సమయంలో ఇన్వజిలేటర్‌ రఫ్‌ వర్క్‌కు పేపర్లు ఇస్తారు. పరీక్ష అనంతరం రఫ్‌ బుక్‌లెట్‌ను డ్రాప్‌బాక్స్‌లో వేయాల్సి ఉంటుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.