జన్మించిన చోటికే వచ్చి గుడ్లు పెట్టే అరుదైన జాతి.. ఏపీ తీరానికి చేరుకుంటున్న ఆలివ్ రిడ్లే తాబేళ్లు

వందలు, వేలు కాదు లక్షల మైళ్ళు సముద్రజలాల్లో ప్రయాణం చేసినా అలసట ఉండదు. అలుపెరుగని ప్రయాణమే వాటి జీవన శైలి. సైబీరియా పక్షుల మాదిరిగా కేవలం సంతానోత్పత్తి కోసమే ఎన్ని వేల కిలోమీటర్లు అయినా ప్రయాణించి పుట్టింటికి వస్తాయి. ఎన్నో విశేషాలకు నిలయమైన ఆ జీవులే ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు.

జన్మించిన చోటికే వచ్చి గుడ్లు పెట్టే అరుదైన జాతి.. ఏపీ తీరానికి చేరుకుంటున్న ఆలివ్ రిడ్లే తాబేళ్లు
Olive Ridley Turtles
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 06, 2023 | 5:57 PM

ఈ సకల చరాచర జగతిలో ఎన్నో జాతులు ఉన్నాయి. వాటిల్లో కొన్ని జాతులు ఎప్పటికీ ప్రత్యేకమే.. అలాంటి కోవకు చెందినవే ఈ ఆలివ్ రిడ్లే తాబేళ్లు. రెండడుగుల పొడవు, సుమారు 500 కేజీల బరువు ఉండే ఈ తాబేళ్లు ఆకరణలోనే కాదు.. జీవన విధానం కూడా ఎంతో ప్రత్యేకం. తీసుకునే ఆహారం దగ్గర నుంచి.. సంతానోత్పత్తి వరకు ఎన్నో విశేషాలు ఈ తాబేలు సొంతం.. వీటిల్లో 7 జాతులుండగా 5 జాతుల తాబేళ్లు జపాన్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్‌ సహా ఎక్కడ ఉన్నా.. అవి ఎక్కడైతే పుట్టాయో అక్కడేకే వచ్చి గుడ్లు పెడుతుంటాయి. ఈ తాబేళ్లు జీవితం అంతా సముద్రంలోనే గడుపుతాయి. అయితే గుడ్లు పెట్టడానికి భూమి మీదకు వస్తాయి. నదులు సముద్రంలో కలిసే చోటు వీటి సంతానోత్పత్తికి అనువుగా ఉంటుంది. ఏపీ సముద్రతీరంలో పుట్టి ఎక్కడెక్కడికో వెళ్లిన తాబేళ్లు తిరిగి తూర్పు తీరానికి వస్తున్నాయి. సంతానోత్పత్తి సమయం కావడంతో తీరంలో తాబేళ్ల సందడి చేస్తున్నాయి.

ఆలివ్ రిడ్లే తాబేళ్లు 12 నుంచి 15 ఏళ్లలో సంతాన ఉత్పత్తిని ప్రారంభిస్తాయి. ఎక్కువుగా అర్ధరాత్రి 2 నుంచి తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో తీరాలకు చేరుకుంటాయి. ఆ సమయంలోనే అవి గుడ్లు పెడతాయి. ఇసుకను లోతుగా తోడేసి.. అందులో 60 నుండి 190 వరకు గుడ్లు పెడతాయి. మళ్లీ ఇసుకతో కప్పేసి సముద్రంలోకి వెళ్ళిపోతుంటాయి. భారీ సైజులో ఉండే సముద్ర తాబేళ్లకు తీరంలో రక్షణ కరువవుతోంది. కుక్కలు, నక్కలు, ఇతర జంతువులు వీటి గుడ్లను తినేస్తుంటాయి. చివరకు కొన్ని మాత్రమే పిల్లలుగా తయారై వాటంతటవే సముద్రంలోకి వెళ్లిపోతుంటాయి. కొన్నిసార్లు ఆ పిల్లలను కూడా కొన్ని జంతువులు వేటాడి తినేస్తుంటాయి. ఇలా పుట్టినప్పటి నుంచీ సముద్ర తాబేళ్లకు ప్రాణసంకటంగానే ఉంటుంది. గుడ్లు పెట్టడానికి తీరానికి వచ్చిన తాబేళ్లు ఒక్కోసారి మత్స్యకారుల వలలకు చిక్కుతాయి. వాటిని జాగ్రత్తగా సముద్రంలో వదిలేయాల్సిన కొంతమంది విచక్షణారహితంగా వ్యవహరించడంతో అవి చనిపోతున్నాయి. అందుకే వీటి పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు అధికారులు. అరుదైన ఆలివ్‌ రిడ్లే తాబేళ్ల సంతతిని పరిరక్షించడానికి.. వాటి గుడ్లను సేకరించి.. ప్రత్యేకంగా పొదిగించి.. మళ్లీ సముద్రంలో లక్షలాది చిరుజీవులను విడిచిపెట్టే గొప్ప ప్రయత్నం చేస్తున్నారు.

ఏపీ వ్యాప్తంగా 62 ప్రదేశాల్లో వీటి కోసం అటవీ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కృష్ణా జిల్లాలోని 5 ప్రదేశాల్లో వీటికోసం సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు వైల్డ్ లైఫ్ అధికారులు. దివిసీమ ప్రాంతాలైన పాలకాయతిప్ప, సంగమేశ్వరం, లైట్ హౌస్, జింకపాలెం ప్రాంతంలో.. పర్యాటకులు రాకుండా పర్యవేక్షిస్తున్నారు. అవి సంచరించే ప్రాంతాన్ని సంరక్షణ ప్రాంతంగా నిర్ణయించి, బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. గుడ్లు పెట్టే ప్రాంతాల్లో జనసంచారం లేకుండా చూస్తున్నారు. గుడ్లు పొదిగి పిల్లలయ్యేంత వరకూ సుమారు 40 రోజుల పాటు రక్షణ వలయం ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. తాబేలు గుడ్డు పెట్టిన దగ్గర నుంచి వాటి పిల్లలు తిరిగి సముద్రంలోకి వెళ్లే వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

గుడ్లను తీసుకొచ్చి.. 10 అంగుళాల లోతు గుండ్రంగా గుంత తీసి ఆ గుంటలో 100 నుంచి 120 వరకు గుడ్లను పెట్టి వాటిని కప్పేస్తారు. సహజసిద్ధంగా 40 నుంచి 65 రోజుల్లో గుడ్ల నుంచి పిల్లలు బయటకు వస్తాయి. 28 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో పొదిగిన గుడ్లు మగ తాబేళ్లుగాను, 30 నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రతలో పొదిగిన గుడ్లు ఆడ తాబేళ్లుగాను తయారవుతాయి. అందుకే ఆ ప్రాంతంలో వాతావరణం అనుకూలంగా ఉండేలా చర్యలు తీసుకుంటారు అధికారులు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 1896 ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఏపీ తీరానికి వచ్చినట్టుగా అధికారులు చెప్తున్నారు. అవి సుమారు 2 లక్షల 11 వేల గుడ్లు పెట్టాయి. అందులో ఇప్పటివరకు 45 వేల 312 పిల్లలుగా మారి సముద్రబాట పట్టాయి. కృష్ణా జిల్లాలోని 5 ప్రాంతాల నుంచి 17 వేల ఆలివ్ రిడ్లే పిల్లలు బయటకి వచ్చాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ నుండే 25 శాతం ఉత్పత్తి జరుగుతుందన్నమాట.

అటవీ శాఖ అధికారులు స్థానిక జాలర్లు, సంచార జాతులకు చెందిన యానాదులను కూడా ఇందులో భాగస్వాములను చేశారు. ఏడాదిలో ఐదు నెలల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి జీతాలు చెల్లిస్తున్నారు. మత్స్యకారులు ఉపయోగించే రింగు వలలు, పడవలతో పాటు తీరప్రాంత కాలుష్యం కారణంగా తాబేళ్లు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. కుక్కలు, తోడేళ్లు కూడా సముద్ర తీర ప్రాంతంలో తాబేలు గుడ్లకు హాని కలిగిస్తున్నాయి. సముద్రంలో విషపు కాయలు, జెల్లీ ఫిష్ లాంటి వాటిని ఆహారంగా తీసుకుని అటు సముద్రానికి ఇటు మత్స్యకారులకు ఎంతో మేలు చేస్తున్న ఈ అరుదైన జాతిని రక్షించాల్సిందిగా అధికారులు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..