ONE RUPEE BIRYANI: ఆఫర్.. బంపర్‌ ఆఫర్‌.. ఆ ఒక్క నోటు ఉంటే బిర్యానీ ఫ్రీ అంటూ ఫ్లేక్సీ.. కట్ చేస్తే .. రెస్టారెంట్‌ యాజమాన్యం షాక్..

ప్రకాశం జిల్లాలో రూపాయికే బిర్యానీ అంటూ ఓ రెస్టారెంట్ యజమాని చేసిన ప్రకటన పెద్ద సంచలనంగా మారింది. మార్కాపురంలో మొఘల్ బిర్యానీ హౌస్ ను ప్రారంభించిన సందర్భంగా ఆ బిర్యానీ హౌస్ యజమాని ఈ ఆఫర్‌ను ప్రకటించారు. దీంతో రూపాయికి చికెన్ బిర్యానీ అని జనం రెస్టారెంట్‌కు పరుగులు పెట్టారు. వారు ఇచ్చిన ప్రకటనతో రెస్టారెంట్ ముందు భారీ క్యూ.. దీంతో పెద్ద ఎత్తున జనం రూపాయి నోటు తీసుకుని క్యూ కట్టారు. ఆ రూపాయి కాదు అంటూ షరతులు పెట్టడంతో జనం షాకయ్యారు.

ONE RUPEE BIRYANI: ఆఫర్.. బంపర్‌ ఆఫర్‌.. ఆ ఒక్క నోటు ఉంటే బిర్యానీ ఫ్రీ అంటూ ఫ్లేక్సీ.. కట్ చేస్తే .. రెస్టారెంట్‌ యాజమాన్యం షాక్..
One Rupee Biryani
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 06, 2023 | 5:02 PM

మీ దగ్గర రూపాయి నోటు ఉందా?.. అయితే.. నోరూరించే బిర్యానీ మీ సొంతం అయినట్లే. కానీ.. ఆ బిర్యానీ కావాలంటే ప్రకాశం జిల్లా మార్కాపురం వెళ్లాల్సిందే. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ రెస్టారెంట్‌ ఓపెనింగ్‌ సందర్భంగా.. రూపాయి నోటుకు బిర్యానీ అంటూ ఆఫర్‌ ప్రకటించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు బిర్యానీ ఫ్రీ అని ఫ్లెక్సీ ప్రదర్శించారు. విషయం తెలుసుకున్న బిర్యానీ ప్రియులు.. రూపాయ్‌ నోటుతో ఆ రెస్టారెంట్‌కు క్యూ కట్టారు. ఎండను కూడా లెక్కచేయకుండా.. బిర్యానీ కోసం.. జనాలు.. ఎగబడడంతో రెస్టారెంట్‌ యాజమాన్యం షట్టర్‌ క్లోజ్‌ చేసింది. ఫలితంగా.. బిర్యానీ ప్రియులు.. ఎండలో పడిగాపులు కాయాల్సి వచ్చింది.

అయితే.. తలుపులు మూసివేసిన రెస్టారెంట్‌ సిబ్బంది.. చివరికి.. రూపాయి నోటు తెచ్చుకున్నవారికి.. చిన్న కౌంటర్‌ ఏర్పాటు చేసి పార్శిల్‌ రూపంలో బిర్యానీ ప్యాకెట్లు అందజేసింది.

షరతులవీ…

అయితే మార్కాపురం నగరంలో రెస్టారెంట్ యాజమాన్యం ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో పెద్ద సంఖ్యలో జనం రెస్టారెంట్ ఎదుటకు చేరుకున్నారు. అయితే పాత రూపాయి నోటు తెస్తేనే ఒక చికెన్ బిర్యానీ అంటూ షరతులు పెట్టారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటల వరకూ మాత్రమే మరో ట్విస్ట్ ఇచ్చారు. జనం ఏ మాత్రం తగ్గలేదు.. తమ ఇంట్లో మూలన పడేసిన పాత రూపాయి నోట్లను పట్టుకుని అక్కడికి చేరుకున్నారు. పాత రూపాయి నోట్లతో కూడా భారీగా జనం రావడంతో ఇప్పుడు రెస్టారెంట్ యాజమన్యం షాకయ్యింది. ఇళ్లలో వెతికి మరీ తీసుకుని జనం పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో రెస్టారెంట్‌ను యజమాని కాసేపటికే నిలిపివేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం