AP Weather: ఓరి బాబోయ్.. అల్పపీడనం ముప్పు వీడనే లేదు.. ఈ లోపే

ఏపీకి వానల ముప్పు ఇంకా వీడలేదని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు పడే ఆస్కారం ఉన్నట్లు తెలిపింది. ఆంధ్రా లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకుందాం పదండి...

AP Weather: ఓరి బాబోయ్.. అల్పపీడనం ముప్పు వీడనే లేదు.. ఈ లోపే
Andhra Weather
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 27, 2024 | 12:47 PM

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలహీనపడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో అనగా దక్షిణ ఆంధ్రప్రదేశ్-ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఎగువ వాయు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వెల్లడించారు. నెల్లూరు, ప్రకాశం సహా దక్షిణ కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. అనంతపురం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, సత్యసాయి, చిత్తూరు జిల్లాలతో సహా రాయలసీమలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది.

అల్పపీడన ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 65 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. రానున్న రెండ్రోజులు రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటికే ప్రధాన పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రానున్న రెండు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని IMD కోరింది. విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారిణి సుధావల్లి మీడియాతో మాట్లాడుతూ రానున్న రెండు రోజులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.  తీవ్రమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నందున, అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని ఆమె పౌరులను కోరారు.

మరోవైపు తెలంగాణలోను శుక్రవారం, శనివారం తేలిక‌పాటి నుంచి మోస్తరు వ‌ర్షాలు కురుస్తాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని ప‌లు చోట్ల చ‌ల్లని గాలులతోపాటు, వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో ఐదు రోజుల పాటు క‌నిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన వ‌ర్షాలకు పలు చోట్ల వ‌రి ధాన్యంతో పాటు ఇత‌ర పంట‌లు త‌డిసిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణా వైపు శీతలు గాలులు వీస్తున్నాయని ఐఎండీ పేర్కొంది. దీంతో, చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!