Rain Alert: తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. నేటి నుంచి మూడు రోజులపాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఒకట్రెండు రోజుల్లో రుతుపవనాలు కూడా దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
Rain Alert
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 24, 2023 | 7:26 AM

మండుతున్న ఎండల నుంచి ఉపశమనం కల్పించేలా తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. ఇవాళ, రేపట్లో.. నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్‌ సముద్రం, అండమాన్‌ నికోబార్‌ దీవులకు ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర-దక్షిణ ద్రోణి.. విదర్భ నుంచి ఉత్తర కేరళ వరకు మరఠ్వాడా అంతర్గత కర్ణాటక మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దాంతో.. ఏపీలో ఇప్పటికే దక్షిణ, నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఉత్తర కోస్తా, రాయలసీమలోనూ రెండు, మూడు రోజులు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కొన్ని చోట్ల వీచే చాన్స్‌ ఉంది.

మరోవైపు, తెలంగాణలోనూ కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఇవాళ, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ప్రకటించిన వాతావరణ శాఖ.. ఎల్లుండి మాత్రం పొడి వాతావరణం ఉంటుందని వివరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రెండు, మూడు రోజులు పగటి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని, హైదరాబాద్‌ చుట్టు పక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మొత్తంగా.. తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు ఎండలు.. మరోవైపు వానలు పడుతుండటంతో భిన్న వాతావరణ అనుభూతులు కలుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు