AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: పార్క్‎కి వెళ్దామనిచెప్పి.. భార్యను పైలోకాలకు పంపిన భర్త.. అసలు కారణం ఇదే..

భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది అని తెలిసిన భర్త కిరాతకానికి ఒడిగట్టాడు. ఆమెను పార్కుకు వెళదామని నమ్మించి అనంత లోకాలకు పంపించాడు పార్కు సమీపంలో ఉన్న కంపచెట్లలోకి తీసుకొని వెళ్లి గొంతు నులిమి చంపి ఇసుకలో పూడ్చి పెట్టాడు. ఆ తరువాత తానే స్వయంగా పోలీసుల వద్దకు వెళ్లి తన భార్యను హత్య చేశానంటూ లొంగిపోయాడు. ఈ ఘటన కడప జిల్లాలో కలకలం రేపింది.

Watch Video: పార్క్‎కి వెళ్దామనిచెప్పి.. భార్యను పైలోకాలకు పంపిన భర్త.. అసలు కారణం ఇదే..
Extramarital Affair
Sudhir Chappidi
| Edited By: Srikar T|

Updated on: Jul 13, 2024 | 10:42 AM

Share

భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది అని తెలిసిన భర్త కిరాతకానికి ఒడిగట్టాడు. ఆమెను పార్కుకు వెళదామని నమ్మించి అనంత లోకాలకు పంపించాడు పార్కు సమీపంలో ఉన్న కంపచెట్లలోకి తీసుకొని వెళ్లి గొంతు నులిమి చంపి ఇసుకలో పూడ్చి పెట్టాడు. ఆ తరువాత తానే స్వయంగా పోలీసుల వద్దకు వెళ్లి తన భార్యను హత్య చేశానంటూ లొంగిపోయాడు. ఈ ఘటన కడప జిల్లాలో కలకలం రేపింది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని అమృత్ నగర్‎కు చెందిన అన్వర్ భాష జమ్మలమడుగులోని మైలవరం మండలం దుడియం గ్రామానికి చెందిన రేష్మ అనే మహిళను 10 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. అయితే వీరిద్దరి సంసారం సజావుగానే సాగుతున్నప్పటికీ అన్వర్ భాష ప్రోక్లైన్ డ్రైవర్గా పనిచేస్తుండడం భార్యకు తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇంటికి కొన్ని రోజులు రాకుండా డ్యూటీలోనే ఉండడంతో వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇలా భర్త పనికి వెళ్లే సమయంలో, భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధానికి రేష్మ అనే మహిళ అలవాటు పడింది. ఈ విషయం తెలిసిన అన్వర్ భాష గతంలో ఒకసారి హెచ్చరించినట్లు సమాచారం.

అయితే భర్త మాటలను పెడచెవిన పెట్టిన భార్య రేష్మ వివాహేతర సంబంధాన్ని అలాగే కొనసాగిస్తుండడంతో గత కొంత కాలం క్రితం ఇద్దరు గొడవపడి వేరువేరుగా ఉంటున్నట్లు స్థానికులు అంటున్నారు. గత పది రోజుల క్రితం కూడా వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని అప్పుడు రేష్మ భర్తను వదిలేసి తన బంధువుల ఇంటికి వెళ్లి అక్కడే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోని శుక్రవారం సాయంత్రం భార్య రేష్మ వద్దకు వెళ్లిన భర్త.. పార్కుకు వెళదామని ఆమెను నమ్మించాడు. ప్రొద్దుటూరులోని ఎకో పార్కుకు తీసుకొని వెళ్ళాడు. వెళ్లిన కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఎకో పార్క్ ఎదురుగా ఉన్న కంపచెట్ల లోనికి తీసుకొని వెళ్లి గొంతు నులిమి చంపేశాడు. అక్కడే ఇసుకలో పూడ్చిపెట్టి నేరుగా పోలీస్ స్టేషన్‎కు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పాడు. నిందితుడి మాటలు విన్న వెంటనే అప్రమత్తమైన పోలీసులు అన్వర్ భాషను అదుపులోకి తీసుకొని భార్యను పూడ్చిపెట్టిన స్థలానికి చేరుకున్నాఉ. ఆమెను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి పంపించారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఏదేమైనా వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..