వైజాగ్ పోర్టుకు మహర్థశ.. ఈ రెండు దేశాల కార్గో ఒప్పందాలపై చర్చలు..

ఇటీవల కాలంలో మెరుగైన పనితీరుతో అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న విశాఖ పోర్టుపై అందరి దృష్టి పడుతోంది. తాజాగా శ్రీలంక, బంగ్లాదేశ్‎తో వాణిజ్యం కోసం వైజాగ్ పోర్టును రవాణా కేంద్రంగా ఎంచుకునే అవకాశాలను పరిశీలిస్తోంది. భారత జలరవాణా మంత్రిత్వ శాఖ, బంగ్లాదేశ్ షిప్పింగ్ మంత్రిత్వ శాఖల మధ్య కొనసాగుతున్న చర్చలు విజయవంతమైతే, బంగాళాఖాతం వెంబడి తూర్పు తీరంలో జలమార్గం ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్యం మరింత మెరుగుపడుతుంది.

వైజాగ్ పోర్టుకు మహర్థశ.. ఈ రెండు దేశాల కార్గో ఒప్పందాలపై చర్చలు..
Visakhapatnam
Follow us
Eswar Chennupalli

| Edited By: Srikar T

Updated on: Jul 13, 2024 | 10:19 AM

ఇటీవల కాలంలో మెరుగైన పనితీరుతో అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న విశాఖ పోర్టుపై అందరి దృష్టి పడుతోంది. తాజాగా శ్రీలంక, బంగ్లాదేశ్‎తో వాణిజ్యం కోసం వైజాగ్ పోర్టును రవాణా కేంద్రంగా ఎంచుకునే అవకాశాలను పరిశీలిస్తోంది. భారత జలరవాణా మంత్రిత్వ శాఖ, బంగ్లాదేశ్ షిప్పింగ్ మంత్రిత్వ శాఖల మధ్య కొనసాగుతున్న చర్చలు విజయవంతమైతే, బంగాళాఖాతం వెంబడి తూర్పు తీరంలో జలమార్గం ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్యం మరింత మెరుగుపడుతుంది.

ఈ పోర్ట్‎లను సందర్శించిన బంగ్లాదేశ్ అధికారులు..

బంగ్లాదేశ్ షిప్పింగ్ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారుల బృందం ఇటీవల చెన్నై సహా తూర్పు తీరంలోని నాలుగు కీలక ఓడరేవులను పర్యటించింది. వాటిలో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు కృష్ణపట్నం ఓడరేవు, విశాఖపట్నం ఓడరేవుల యాజమాన్యాలతో చర్చలు జరిపింది. పోర్టులు వాటి కార్యకలాపాలు, సామర్థ్యాలను అర్థం చేసుకోకుని వాణిజ్యాన్ని మరింత పెంచుకోవడానికి ఉన్న అవకాశాలును బంగ్లాదేశ్ టీమ్ చర్చించింది.

విశాఖ పోర్టు పైనే ఆసక్తి..

బంగ్లాదేశ్ షిప్పింగ్ మంత్రిత్వ శాఖ బృందం మొదట తమిళనాడులోని చెన్నై పోర్టును అక్కడనుంచి కృష్ణపట్నం పోర్టు‎ను సందర్శించి అనంతరం వైజాగ్ వచ్చింది. పోర్ట్ చైర్మన్ M. అంగముత్తు నేతృత్వంలోని VPA బృందంతో బంగ్లాదేశ్ అధికారులు సుదీర్ఘ చర్చలు జరిపారు. వాళ్ళ దేశ భవిష్యత్ అవసరాల కోసం నిర్ణయాలు తీసుకునే ముందు ఇలాంటి చర్చలు తప్పవని టీం అభిప్రాయ పడింది. బంగ్లాదేశ్‎లోని చిట్టగాంగ్ నౌకాశ్రయం బంగాళాఖాతం మీదుగా మన వైజాగ్ పోర్ట్‌కి 800 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. అందుకే శ్రీలంకతో తమ ప్రస్తుత కార్యకలాపాల కోసం విశాఖ పోర్ట్‎ని తమ రవాణా నౌకాశ్రయ హబ్‎గా పరిగణించిందని విశాఖ పోర్టు చైర్మన్ తెలిపారు.

2023-24 ఆర్థిక సంవత్సరంలో లక్షల టన్నుల కార్గో ఎగుమతి..

బంగ్లాదేశ్‎కు చెందిన కార్గో ట్రాఫిక్‎ను విశాఖ పోర్టు ఇప్పటికే హ్యాండిల్ చేస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2,13,466 టన్నుల కార్గోలో 2,03,769 టన్నుల ఎగుమతి, 9,697 టన్నుల దిగుమతి చేసింది. 2022-23 సంవత్సరంలో గత ఏడాది కంటే ఎక్కువ స్థాయిలో కార్గో ట్రాఫిక్ హ్యాండిల్ చేసినట్లు గుర్తించారు. మొత్తం 2,48,559 టన్నుల కార్గోలో 2,17,277 టన్నులు ఎగుమతి, 31,282 టన్నుల దిగుమతిని కలిగిఉన్నట్లు రికార్డులు పరిశీలించారు అధికారులు. బంగ్లాదేశ్‎కు కార్గో‎ ద్వారా ప్రధానంగా వాణిజ్య రవాణా ద్వారా చేస్తున్న వస్తువుల్లో ఇంధన నూనె, ద్రవ అమ్మోనియా, మొక్కజొన్న, బియ్యం, కంకర రాయి, స్టోన్ చిప్స్, క్వార్ట్‌జైట్, గోధుమలు ఉన్నాయని విశాఖ పోర్ట్ అధికారులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..