MLA Brahmanaidu: అక్రమంగా ప్రవేశించారు.. నాపై హత్యాయత్నం జరిగింది.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
Vinukonda News: వినుకొండలో వైసీపీ-టీడీపీ మధ్య మొదలైన వార్ కంటిన్యూ అవుతోంది. MLA బొల్ల బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. ఇరువర్గాలు సై అంటే సై అంటూ రణరంగాన్ని తలపించేలా కవ్విస్తున్నాయి.
Vinukonda News: వినుకొండలో వైసీపీ-టీడీపీ మధ్య మొదలైన వార్ కంటిన్యూ అవుతోంది. MLA బొల్ల బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. ఇరువర్గాలు సై అంటే సై అంటూ రణరంగాన్ని తలపించేలా కవ్విస్తున్నాయి. దీంతో సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇన్నేళ్లుగా టీడీపీ వినుకొండ అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు. ఈ నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి చేశానన్నారు. అది చూసి ఓర్వలేకే, లోకేష్ పాదయాత్ర మైలేజ్ కోసం టీడీపీ కుట్రపూర్వకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు బ్రహ్మనాయుడు. లోకేష్ పాదయాత్రను అడ్డుకోవాల్సిన అవసరం లేదని.. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు స్పష్టంచేశారు. తన డెయిరీలోకి టీడీపీ నేతలు అక్రమంగా ప్రవేశించారని.. తనపై హత్యాయత్నం జరిగిందని తెలిపారు. కేసు పెడితే అక్రమ కేసు అంటూ బుకాయిస్తున్నారని.. ఘర్షణలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని బ్రహ్మనాయుడు తెలిపారు.
కాగా.. మాజీ ఎమ్మెల్యే GV ఆంజనేయులుపై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ నిన్న వినుకొండలో టీడీపీ శ్రేణులు ధర్నా చేపట్టాయ్. అదే టైమ్‌లో టీడీపీ కార్యకర్తలకు MLA బొల్లా బ్రహ్మనాయుడి వాహనం ఎదురుపడింది. టీడీపీ కార్యకర్తలను చూసి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మీసం తిప్పారు. దాంతో, ఆగ్రహానికి లోనైన టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యే వాహనంపై దాడికి దిగారు. అంతే, అక్కడ్నుంచి మొదలైంది రణరంగం. టీడీపీకి పోటీగా వైసీపీ కార్యకర్తలు రోడ్డుపైకి రావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయ్. ఇరువర్గాల అరుపులు కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. కర్రలు, రాళ్లతో దాడులు చేసుకోవడంతో పలువురికి తలలు పగిలాయ్!.
వైసీపీ, టీడీపీ ఘర్షణతో వినుకొండలో యుద్ధ వాతావరణం ఏర్పడింది. గంటల తరబడి కొనసాగింది ఈ రణరంగం. పోలీసులు వారిస్తున్నా..వెనక్కి తగ్గలేదు ఇరువర్గాలు. టీడీపీ, వైసీపీ శ్రేణులను అతికష్టం మీద కంట్రోల్ చేశారు పోలీసులు.
లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడానికే ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..