AP RGUKT 2nd Phase Counselling: నేటి నుంచి ట్రిపుల్‌ఐటీల్లో రెండో విడత ప్రవేశాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు
రాష్ట్రంలో రాజీవ్ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) ఆధ్వర్యంలోని ట్రిపుల్‌ఐటీల్లో(IIIT) రెండో విడత కౌన్సెలింగ్‌కు శుక్రవారం (జులై 28) నుంచి మొదలవుతుంది. నేటి ఆగస్టు ఒకటో తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో..
అమరావతి, జులై 28: రాష్ట్రంలో రాజీవ్ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) ఆధ్వర్యంలోని ట్రిపుల్‌ఐటీల్లో(IIIT) రెండో విడత కౌన్సెలింగ్‌కు శుక్రవారం (జులై 28) నుంచి మొదలవుతుంది. నేటి ఆగస్టు ఒకటో తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో విద్యార్ధులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వీసీ కేసీరెడ్డి తెలిపారు.
నూజివీడు క్యాంపస్‌లో ఆగస్టు 9,10వ తేదీల్లో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. అంతేకాకుండా మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు క్యాంపస్ మార్పు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తున్నట్లు సూచించారు. క్యాంపస్ మార్పు చేసుకున్న వారికి, రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొన్న వారికి ఆగస్టు 4న సీట్ల కేటాయింపు ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు. సీట్లు పొందిన వారు 11న ఆయా క్యాంపస్‌ల్లో రిపోర్టు చేయాలని పేర్కొన్నారు.
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.