Chittoor District: చిత్తూరు జిల్లాలో గాలి వాన బీభత్సం.. భారీగా ఆస్థి, పంట నష్టం..
Chittoor District: చిత్తూరు జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన గాలి వాన బీభత్సం సృష్టించింది. ఆకాశం మేఘావృతమై ఆకస్మికంగా వర్షంతో పాటు పెనుగాలులు వీచాయి. పెద్ద పంజాని..
Chittoor District: చిత్తూరు జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన గాలి వాన బీభత్సం సృష్టించింది. ఆకాశం మేఘావృతమై ఆకస్మికంగా వర్షంతో పాటు పెనుగాలులు వీచాయి. పెద్ద పంజాని (Pedda Panjani) మండలంలో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు చెట్లు విరిగిపడ్డాయి. పలు పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. లింగాపురం పంచాయతీ జీవి పల్లి వద్ద ఉన్న వి ఎస్ ఎన్ హాచరీస్ కోళ్ల ఫారం షెడ్లు నేలమట్టం అయింది. వర్షాలకు నీరు రహదారిపై ప్రవహించి పరిస్థితి అధ్వానంగా మారింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఈ అకాల వర్షాలకు వాతావరణంలో మార్పులు కారణమని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. కాగా గాలివానకు మామిడి జీడి తోటలు, మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Tirumala: శ్రీవారి ఆలయంలో రోజురోజుకీ పెరుగుతున్న భక్తుల రద్దీ.. సౌకర్యాల కల్పన పై అధికారుల దృష్టి