Hot And Dry Weather: తెలంగాణాలో పలు ప్రాంతాల్లో భానుడు భగభగలు.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి

Telugu States: తెలుగు రాష్ట్రాల్లో గడచిన కొన్ని రోజులుగా కొంతమేర చల్లదనం కనిపించిన సోమవారం తెలు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భానుడు భగభగ మండించాడు. తెలంగాణలో(Telangana) పలు జిల్లాల్లో ఎండలు ..

Hot And Dry Weather: తెలంగాణాలో పలు ప్రాంతాల్లో భానుడు భగభగలు.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
Hot And Dry Weather
Follow us

|

Updated on: Apr 19, 2022 | 7:36 AM

Telugu States: తెలుగు రాష్ట్రాల్లో గడచిన కొన్ని రోజులుగా కొంతమేర చల్లదనం కనిపించిన సోమవారం తెలు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భానుడు భగభగ మండించాడు. తెలంగాణలో(Telangana) పలు జిల్లాల్లో ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. సోమవారం జగిత్యాల జిల్లాలోని(Jagtial District) జైనలో 44.2 డిగ్రీల సెల్సియస్‌తో రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఈ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.  ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా, పెద్దపల్లి జగిత్యాల జిల్లాల్లో 43.1 నుంచి 44 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో గత వారంతో పోలిస్తే.. సోమవారం అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత పెరిగినట్లు తెలుస్తోంది. వడగాల్పుల వీస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. దీంతో జనం బయటకు రావడానికి భయపడుతున్నారు. అత్యవసర పరిస్థితి అయితేనే వీధుల్లో దర్శనమిస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండడం వలన రోడ్లు, షాపులు, ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మధ్యాహ్నం దుకాణాలు మూసివేస్తున్నారు. మరోవైపు రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో  అక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేశారు.  సాయంత్రం వేళ జనసంచారం కొనసాగుతోంది.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వృద్ధులు, చిన్నారుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య సిబ్బంది సూచిస్తున్నారు.

ఈ వేసవిలో గతం తో పోలిస్తే.. అత్యధిక ఉష్ణోగ్రతలు తప్పవని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని.. వైద్యులు హెచ్చరిస్తున్నారు. గడిచిన నాలు రోజుల్లో భాగ్యనగరంలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురవడం మినహా గడిచిన మూడు రోజులుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపినప్పటికీ చినుకుల జాడ కనిపించడం లేదు. దీంతో ప్రజలు మండుతున్న ఎండల నుంచి వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం  ఫ్యాన్లను, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు ఏప్రిల్‌ లోనే ఇలా భానుడు ప్రతాపం చూపిస్తూనే.. ఇక మే నెలలో ఎండల పరిస్థితి ఏమిటి అంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Petrol-Diesel Price Today: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న చమురు ధరలు.. 14రోజుల తర్వాత ఎలా ఉన్నాయంటే?

MellaChervu: మై హోమ్ ఇండస్ట్రీస్‌లో కనుల పండుగగా శ్రీవారి కల్యాణోత్సవాలు.. హాజరైన జూపల్లి దంపతులు