AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone: తీవ్ర వాయుగుండంగా మారిన అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం ఏర్పడింది. మరికొద్ది గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారినట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. ఇది విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 420 కి.మీ, ఒడిశాకు దక్షిణ-ఆగ్నేయదిశగా 190 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ దిగాకు నైరుతి దిశగా 280 కిలోమీటర్లు, బంగ్లాదేశ్ ఖేపు పారాకు నైరుతి దిశగా 390 కిలోమీటర్ల దూరంలో

Cyclone: తీవ్ర వాయుగుండంగా మారిన అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..
AP Rains
Srikar T
|

Updated on: Nov 17, 2023 | 9:00 AM

Share

బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం ఏర్పడింది. మరికొద్ది గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారినట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. ఇది విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 420 కి.మీ, ఒడిశాకు దక్షిణ-ఆగ్నేయదిశగా 190 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ దిగాకు నైరుతి దిశగా 280 కిలోమీటర్లు, బంగ్లాదేశ్ ఖేపు పారాకు నైరుతి దిశగా 390 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర-ఈశాన్య దిశగా ప్రయాణిస్తూ శుక్రవారం నాటికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ పేర్కొన్నారు.

గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని తెలిపారు. మరి కొన్ని గంటల్లో తుఫానుగా మరే అవకాశం ఉందంటున్నారు. దీనికి మాల్దీవులు మిధిలి అనే పేరు పెట్టింది. శనివారం నాటికి నాటికి మరింత బలపడి బంగ్లాదేశ్ ఖేపు పార – మోంగ్ల మధ్య తీరం దాటుతుందని ఐఎండి ప్రకటించింది. ఈ వాయుగుండం తీరం దాటిన తరువాత ఈనెల చివరి నాటికి ఈశాన్య రుతుపవనాలు బలం పుంజుకొని రాష్ట్రమంతటా విస్తరించి భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో సముద్రంలో అలల ఉధృతి తీవ్రంగా ఉంటుంది. కావున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నెగెటివ్‌ థాట్స్ ఎలా ఆపాలి? ఈ కథ మీ సందేహాలకు సమాధానం చెబుతుంది!
నెగెటివ్‌ థాట్స్ ఎలా ఆపాలి? ఈ కథ మీ సందేహాలకు సమాధానం చెబుతుంది!
డబ్బు నిలవడం లేదా..? ఆర్థిక ఇబ్బందులకు కేమద్రుమ యోగమే కారణమా?
డబ్బు నిలవడం లేదా..? ఆర్థిక ఇబ్బందులకు కేమద్రుమ యోగమే కారణమా?
పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలా..? రూల్స్‌లో పెద్ద మార్పులు..
పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలా..? రూల్స్‌లో పెద్ద మార్పులు..
35 ఏళ్లకే కన్నుమూసిన నవ్వుల నవాబు..
35 ఏళ్లకే కన్నుమూసిన నవ్వుల నవాబు..
జాతీయ పక్షి నెమలి ఎన్ని సంవత్సరాలు జీవిస్తుందో తెలుసా?
జాతీయ పక్షి నెమలి ఎన్ని సంవత్సరాలు జీవిస్తుందో తెలుసా?
కాఫీ ఎక్కువగా తాగే దేశమేది? యాపిల్, నిమ్మ ఎందుకు నీళ్లలో తేలుతాయి
కాఫీ ఎక్కువగా తాగే దేశమేది? యాపిల్, నిమ్మ ఎందుకు నీళ్లలో తేలుతాయి
తొందరగా బరువు పెరిగే నెల్లూరు గొర్రెలు: లాభదాయక పెంపకం
తొందరగా బరువు పెరిగే నెల్లూరు గొర్రెలు: లాభదాయక పెంపకం
నవరాత్రుల్లో ఈ రాశులకు రాజయోగం.. సంపద, ఉద్యోగం, వ్యాపారంలో..
నవరాత్రుల్లో ఈ రాశులకు రాజయోగం.. సంపద, ఉద్యోగం, వ్యాపారంలో..
ఏ పండులో అన్ని విటమిన్లు ఉంటాయి? ఇలాంటి పండు భూమిపై నిజంగా ఉందా..
ఏ పండులో అన్ని విటమిన్లు ఉంటాయి? ఇలాంటి పండు భూమిపై నిజంగా ఉందా..
200 ప్లస్ టార్గెట్ వస్తే అభిషేక్ శర్మకు ఏమవుతుంది?
200 ప్లస్ టార్గెట్ వస్తే అభిషేక్ శర్మకు ఏమవుతుంది?