Andhra Pradesh: భారీగా పెరిగిన రైల్వే ప్రయాణికుల సంఖ్య.. రికార్డ్ సృష్టిస్తున్న దక్షిణ మధ్య రైల్వే
సాధారణ మరియు స్లీపర్ తరగతి ప్రయాణీకుల సంఖ్యలో గణనీయమైన వృద్ధిని నమోదుచేసిన దక్షిణ మధ్య రైల్వే వివిధ వర్గాల ప్రయాణికులకు సేవలందించడంలో ముందంజలో ఉంది. జోన్ పరిధిలో అధిక సంఖ్యలో ప్రయాణికులకు రైలు సేవలను అందించడానికి, కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం, ప్రత్యేక రైళ్లను నడపడం, అదనపు స్టాపేజ్‌లు మరియు కోచ్‌ల సంఖ్య పెంపుదల వంటి అనేక చర్యలను చేపట్టింది. దీని పర్యవసానంగా, దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకుల విభాగంలో గణనీయమైన..
విజయవాడ, నవంబర్ 16: సాధారణ మరియు స్లీపర్ తరగతి ప్రయాణీకుల సంఖ్యలో గణనీయమైన వృద్ధిని నమోదుచేసిన దక్షిణ మధ్య రైల్వే వివిధ వర్గాల ప్రయాణికులకు సేవలందించడంలో ముందంజలో ఉంది. జోన్ పరిధిలో అధిక సంఖ్యలో ప్రయాణికులకు రైలు సేవలను అందించడానికి, కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం, ప్రత్యేక రైళ్లను నడపడం, అదనపు స్టాపేజ్‌లు మరియు కోచ్‌ల సంఖ్య పెంపుదల వంటి అనేక చర్యలను చేపట్టింది. దీని పర్యవసానంగా, దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకుల విభాగంలో గణనీయమైన వృద్ధిని సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనగా 2023-24 అక్టోబర్ వరకు సాధారణ మరియు స్లీపర్ తరగతి ప్రయాణీకుల సంఖ్యలో పెరుగుదలను నమోదు చేసింది.
దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో మొత్తం 15.75 కోట్ల మంది ప్రయాణికులకు రవాణా సౌకర్యాన్ని అందించింది. ఇది జోన్ మొత్తం ప్రయాణికుల సంఖ్యలో 90.9%. ఇందులో జనరల్ & స్లీపర్ కోచ్‌లలో ప్రయాణించిన వారి సంఖ్య 14.32 కోట్లు మరియు ఎసి కోచ్‌లలో ప్రయాణించిన వారి సంఖ్య 1.43 కోట్లు. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే జోన్‌లో నాన్ ఏసీ కోచ్‌లలో 1.01 కోట్లు మరియు ఏసీ కోచ్‌లలో 27 లక్షల అదనపు ప్రయాణికులు రాకపోకలు సాగించారు.
దక్షిణ మధ్య రైల్వే గమ్యస్థానాల వారీగా మరియు పండుగల వంటి ప్రత్యేక సందర్భాలలో ప్రయాణీకుల అధిక డిమాండ్ ఉన్న మార్గాలను నిరంతరం పర్యవేక్షిస్తోంది. దీని ప్రకారం, వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే రోజుకు 664 రైళ్లను నడిపింది. రోజు వారీగా నడపబడుతున్న మొత్తం రైళ్లలో, 349 మెయిల్/ఎక్స్ ప్రెస్ రైళ్లు, 209 ప్యాసింజర్ ప్రత్యేక రైళ్లు, 106 ఎమ్ఎమ్‌టిఎస్ రైలు ఉన్నాయి. భారతీయ రైల్వేలు జాతీయ స్థాయిలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజుకు 10,748 రైళ్లను నడుపుతోంది. సాధారణ మరియు స్లీపర్ క్లాస్ కోచ్‌లలో మొత్తం 372 కోట్ల మంది ప్రయాణికులను వారి వారి గమ్యస్థలాలకు చేరవేసింది. అదే సమయంలో 18.2 కోట్ల మంది ప్రయాణికులు ఏసీ కోచ్‌లలో ప్రయాణించారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోల్చినప్పుడు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ వరకు 38 కోట్ల మేర ప్రయాణికులు నాన్ ఏపీ కోచ్‌లలో (సాధారణ & స్లీపర్). 3.1 కోట్ల మేర ప్రయాణికులు ఏసీ కోచ్‌లలో అదనంగా ప్రయాణించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.