Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గృహ నిర్మాణ శాఖ సీఎం జగన్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

సామాన్యుల సొంతింటి కలను సాకారం చేసేలా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. అందులో భాగంగా అధికారయంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు సీఎం జగన్‌.టిడ్కో ఇళ్ల నిర్మాణంపై కూడా రివ్యూ నిర్వహించారాయన. టీడ్కో ఇళ్ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక ఫోకస్‌ పెట్టాలని ఆదేశించారు సీఎం జగన్‌. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...

గృహ నిర్మాణ శాఖ సీఎం జగన్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
CM Jagan Meeting
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 16, 2023 | 7:41 PM

ఏపీ గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం జగన్‌. హౌసింగ్‌ స్కీమ్‌ కింద ఇళ్ల నిర్మాణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గత అక్టోబర్‌లో మహిళలకు 7లక్షల 43వేల ఇళ్లను అందించింది. వచ్చే ఫిబ్రవరి నాటికి మరో 5 లక్షల ఇళ్లను పూర్తి చేసే దిశగా గృహనిర్మాణ శాఖ చర్యలు చేపట్టింది. నాణ్యత ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని.. జగనన్న కాలనీల్లో మెరుగైన మౌలిక సదుపాయాలకల్పన విషయంలో ఎక్కడా రాజీపడొద్దన్నారు. ఎప్పటికప్పుడు నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు సీఎం జగన్‌.

ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే వాటి సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలన్నారు . కరెంట్‌, తాగునీటి సరఫరా, సోక్‌పిట్స్‌ వున్నాయా?లేవా అనే అంశాలను ఎప్పటికప్పుడు మానిటింగ్‌ చేయాలని ఆదేశించారు సీఎం. టిడ్కో ఇళ్ల నిర్మాణంపై కూడా రివ్యూ నిర్వహించారాయన. టిడ్కో ఇళ్ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక ఫోకస్‌ పెట్టాలని ఆదేశించారు సీఎం జగన్‌.

నిర్మాణాలు పూర్తిచేసుకున్న ప్రతి ఇంటినీ ఆడిట్‌ చేయాలి. సదుపాయాలు ఉన్నాయా? లేవా? చెక్‌ చేయాలి. ఎప్పటికప్పుడు ఆడిట్‌ నిర్వహించాలని అధికారులకు సూచించారు సీఎం. మౌలిక సదుపాయాల కల్పనలో ఎక్కడా రాజీ పడవద్దని స్పష్టం చేశారు. గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, సంబంధిత ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..