Rain Alert: తీవ్ర వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం మరింత బలపడింది. ఇది తీవ్రవాయుగుండంగా మారి, ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణిస్తోంది. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్న వాయుగుండం విశాఖకు ఆగ్నేయంగా 380 కిలోమీటర్లు, ఒడిస్సా పారాదీప్ కు దక్షిణంగా 380 కిలోమీటర్లు, వెస్ట్ బెంగాల్ దిగాకు నైరుతి దిశ గా 530, బంగ్లాదేశ్ ఖేపు పారాకు నైరుతి దిశగా 680 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది.

Rain Alert: తీవ్ర వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు.

|

Updated on: Nov 16, 2023 | 7:13 PM

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం మరింత బలపడింది. ఇది తీవ్రవాయుగుండంగా మారి, ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణిస్తోంది. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్న వాయుగుండం విశాఖకు ఆగ్నేయంగా 380 కిలోమీటర్లు, ఒడిస్సా పారాదీప్ కు దక్షిణంగా 380 కిలోమీటర్లు, వెస్ట్ బెంగాల్ దిగాకు నైరుతి దిశ గా 530, బంగ్లాదేశ్ ఖేపు పారాకు నైరుతి దిశగా 680 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా తీవ్రవాయుగుండం క్రమంగా బలపడుతోంది.. నవంబర్‌ 18వ తేదీ నాటికి ఇది మరింత బలపడి బంగ్లాదేశ్ ఖేపు పార – మోంగ్ల మధ్య తీరం దాటుతుందని ఐఎండి ప్రకటించింది. వాయుగుండం ప్రభావంతో ఒడిస్సా పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఏపీ తీరంలోను బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఏపీలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారిన నేపధ్యంలో మత్స్యకారులను సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Follow us
కవ్వించే కళ్లతో ఆకట్టుకుంటున్న క్యూట్ బ్యూటీ.. అవికా గోర్
కవ్వించే కళ్లతో ఆకట్టుకుంటున్న క్యూట్ బ్యూటీ.. అవికా గోర్
మాంసం ప్రియులకు పండగే.. భారీగా తగ్గిన చికెన్ ధరలు..ఏకంగా రూ.100కే
మాంసం ప్రియులకు పండగే.. భారీగా తగ్గిన చికెన్ ధరలు..ఏకంగా రూ.100కే
పాపం.! గుండెపోటుతో కుప్పకూలిన యువ నటి లక్ష్మిక.
పాపం.! గుండెపోటుతో కుప్పకూలిన యువ నటి లక్ష్మిక.
ఎర్రని మందారంలాంటి సోయగం ఈ కుర్రదాని సొంతం.. మృణాళిని రవి ఫొటోస్
ఎర్రని మందారంలాంటి సోయగం ఈ కుర్రదాని సొంతం.. మృణాళిని రవి ఫొటోస్
సినిమాలు నిల్లు.. గ్లామర్ షో మాత్రం ఫుల్లు.. రకుల్ అందాలు అదుర్స్
సినిమాలు నిల్లు.. గ్లామర్ షో మాత్రం ఫుల్లు.. రకుల్ అందాలు అదుర్స్
మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన తాజా సీఎం రేవంత్
మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన తాజా సీఎం రేవంత్
చెన్నైకి వాతావరణశాఖ హెచ్చరిక.. మరో 5 రోజులు.!
చెన్నైకి వాతావరణశాఖ హెచ్చరిక.. మరో 5 రోజులు.!
పోలీసులకే సవాల్ విసిరిన దొంగలు.. దిశ ఎస్సై ఇంట్లో దొంగతనం
పోలీసులకే సవాల్ విసిరిన దొంగలు.. దిశ ఎస్సై ఇంట్లో దొంగతనం
మహిళల్లో ఐరన్ లెవెల్స్ పెంచడానికి తప్పక తినాల్సిన ఆహారాలు ఇవి..
మహిళల్లో ఐరన్ లెవెల్స్ పెంచడానికి తప్పక తినాల్సిన ఆహారాలు ఇవి..
ఆదిలాబాద్ ను కమ్మేసిన పొగ మంచు.. ఓవైపు పొగమంచు, మరోవైపు చిరుజల్లు
ఆదిలాబాద్ ను కమ్మేసిన పొగ మంచు.. ఓవైపు పొగమంచు, మరోవైపు చిరుజల్లు