Andhra Pradesh: అలర్ట్.. ఎండ తీవ్రత దృష్ట్యా పెన్షన్‌ ఇచ్చే వేళల్లో మార్పులు.. కొనసాగుతున్న నగదు పంపిణీ..

ఆంధ్రప్రదేశ్‌‌లో పింఛన్ల పంపిణీలో నిన్న విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. పంపిణీలో చాలా చోట్ల సమస్యలు కనిపించాయి.. మండుటెండల్లో పెన్షన్‌ కోసం వెళ్లి వృద్దులు తిరుపతి, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో నలుగురు చనిపోయారు. ఈ వారమంతా వేడి గాలుల తీవ్రత ఉండటంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు ఉదయం 7 గంటల నుంచే సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ ప్రారంభించారు.

Andhra Pradesh: అలర్ట్.. ఎండ తీవ్రత దృష్ట్యా పెన్షన్‌ ఇచ్చే వేళల్లో మార్పులు.. కొనసాగుతున్న నగదు పంపిణీ..
Ysr Pension Kanuka
Follow us

|

Updated on: Apr 04, 2024 | 9:27 AM

ఆంధ్రప్రదేశ్‌‌లో పింఛన్ల పంపిణీలో నిన్న విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. పంపిణీలో చాలా చోట్ల సమస్యలు కనిపించాయి.. మండుటెండల్లో పెన్షన్‌ కోసం వెళ్లి వృద్దులు తిరుపతి, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో నలుగురు చనిపోయారు. ఈ వారమంతా వేడి గాలుల తీవ్రత ఉండటంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు ఉదయం 7 గంటల నుంచే సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు, దివ్యాంగులు వంటి వారికి తప్పనిసరిగా ఇంటి దగ్గరే పింఛను అందిస్తున్నారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలకు చేరుకుంటున్న పెన్షనర్లు క్యూలైన్లలో నిలబడి నగదు తీసుకుంటున్నారు. మొత్తం 13వేల 669 గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్ల పంపిణీ జరుగుతోంది..

ఏపీలో 66 లక్షల మందికిపైగా పెన్షనర్లు ఉన్నారు. వీరిలో 40 శాతం మందికి సామాజిక పింఛన్లు అందించినట్టు అధికారులు చెప్తున్నారు. పెన్షనర్ల కోసం 19 వందల 51 కోట్ల నిధులను సిద్ధంగా ఉంచామని, ఎక్కడా నిధులకు ఇబ్బంది లేదని వివరిస్తున్నారు. 6వ తేదీ వరకూ సచివాలయాల్లో వృద్ధులకు పెన్షన్లు ఇస్తారు. ఇప్పటికే 26 లక్షలమందికిపైగా అవ్వాతాతలు పింఛన్ అందుకున్నారని చెప్తున్నారు.

నిన్న అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 55 శాతం పెన్షన్ పంపిణీ పూర్తయ్యింది. విశాఖలో 52 శాతం మందికి పెన్షన్లు అందాయి. మిగతా చోట్ల కూడా సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్ అందించేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నారు. వారంటీర్లు ప్రస్తుతం విధుల్లో లేని కారణంగా.. చాలాచోట్ల వృద్ధులకు సరైన సమాచారం చేరక ఇబ్బందులు పడ్డ నేపథ్యంలో.. వృద్ధుల కష్టాల్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ 7 గంటల నుంచే పెన్షన్‌ ఇస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో