YS Jagan: లారీ డ్రైవర్లతో సీఎం జగన్ ముఖాముఖి.. తిరుపతి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర..

ఈ ఎన్నికలు జగన్‌కు, చంద్రబాబుకు జరుగుతున్న యుద్ధం కాదు .. ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం అంటూ సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఈ యుద్ధంలో తాను ప్రజలపక్షాన ఉన్నానన్నారు. డబుల్ సెంచరీ సర్కార్‌ను స్థాపించేందుకు సిద్ధమా..? మంచి వైపున నిలబడి యుద్ధం చేయడానికి మీరంతా సిద్ధమా? అని పిలుపునిచ్చారు.

YS Jagan: లారీ డ్రైవర్లతో సీఎం జగన్ ముఖాముఖి.. తిరుపతి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
Ys Jagan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 04, 2024 | 9:26 AM

ఈ ఎన్నికలు జగన్‌కు, చంద్రబాబుకు జరుగుతున్న యుద్ధం కాదు .. ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం అంటూ సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఈ యుద్ధంలో తాను ప్రజలపక్షాన ఉన్నానన్నారు. డబుల్ సెంచరీ సర్కార్‌ను స్థాపించేందుకు సిద్ధమా..? మంచి వైపున నిలబడి యుద్ధం చేయడానికి మీరంతా సిద్ధమా? అని పిలుపునిచ్చారు. ప్రజలిచ్చిన అధికారంతో ప్రతి ఇంటికి మంచి చేశామన్న జగన్‌.. ఒక వైపు విశ్వసనీయత, మరో వైపు మోసం.. నిజం ఒక వైపు, అబద్ధం మరో వైపు ఉన్నాయన్నారు. ఇన్ని జెండాలు, ఇన్ని పార్టీల ఏకమవుతున్నాయి. కుట్రలు, కుంతంత్రాలు చేస్తున్నాయి.. ప్రత్యేకహోదా ఇవ్వని పార్టీ, హోదాలను అడ్డుకున్న మరో పార్టీ అంతా చంద్రబాబు పక్షమే అంటూ పూతలపట్ట మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ విమర్శించారు.

ఒక్కడిపై అందరూ కలిసి కుట్రలు చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని ఒక పార్టీ విడగొట్టిందని.. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఓ పార్టీ అన్యాయం చేసిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్నారు. విశ్వసనీయత ఒకవైపు, మోసం మరోవైపు ఉన్నాయన్నారు. ఒక్క ఓటుపై ఐదేళ్ల భవిష్యత్‌ ఆధారపడి ఉంది.. ఎవరి వల్ల మంచి జరుగుతుందో ఆలోచించాలన్నారు. ఎవరికి ఓటేస్తే భవిష్యత్‌ మారుతుందో తెలుసుకోవాలంటూ సూచించారు. బటన్‌ నొక్కి నేరుగా ఖాతాల్లో డబ్బులు పడేలా చేశాం.. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చామన్నారు.

ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే..

ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు జగన్‌..మరోసారి అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ఎన్నికల క్షేత్రంలో జగన్ ప్రజల్లోకి వెళ్తున్నారు..ఇందులో భాగంగానే ఆయన చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 8వ రోజుకు చేరుకుంది..గురవరాజుపల్లె దగ్గర నుంచి మరికాసేపట్లో బయలుదేరుతారు జగన్‌.. మల్లవరం, ఏర్పేడు, పనగల్లు, శ్రీకాళహస్తి బైపాస్‌ మీదుగా చిన్న సింగమల సమీపానికి చేరుకుంటారు..అక్కడ 11 గంటలకు లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లతో ముఖాముఖిలో జగన్‌ పాల్గొంటారు..అనంతరం చావలి చేరుకొని భోజన విరామం తీసుకుంటారు..ఇక మధ్యాహ్నం 3.30 గంటలకు నాయుడుపేట సమీపంలోని చెన్నై జాతీయ రహదారి పక్కన జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం ఓజిలి క్రాస్, బుదనం, గూడూరు బైపాస్, మనుబోలు, నెల్లూరు బైపాస్‌ మీదుగా చింతరెడ్డిపాలెం దగ్గర రాత్రి బసకు చేరుకుంటారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..