AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఎమ్మెల్యేలు, మంత్రులకు హాఫ్‌ ఇయర్లీ ఎగ్జామ్స్‌.. CBNతో అట్టా ఉంటది

ఏపీలో ఎమ్మెల్యేలు, మంత్రులకు హాఫ్‌ ఇయర్లీ ఎగ్జామ్స్‌ జరగనున్నాయి. మంత్రులు సెల్ఫ్‌ అసెస్మెంట్‌ ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. 6నెలల పాలనపై ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం ప్రోగ్రెస్‌ రిపోర్ట్ ఇవ్వనున్నారు.

Andhra Pradesh: ఎమ్మెల్యేలు, మంత్రులకు హాఫ్‌ ఇయర్లీ ఎగ్జామ్స్‌.. CBNతో అట్టా ఉంటది
Andhra Ministers
Ram Naramaneni
|

Updated on: Dec 03, 2024 | 7:22 PM

Share

బహుశా మీ అందరికీ కార్పొరేట్ కల్చర్‌ గురించి తెలిసే ఉంటుంది. MNC కంపెనీల్లో ఉద్యోగులకు KRA అని ఒకటి ఉంటుంది. అంటే కీ రోల్‌ అసెస్‌మెంట్‌. ప్రతీఏటా జీతాల పెంపునకు ముందు ఈ ప్రక్రియ ఉంటుంది. ఏడాదిలో వాళ్లు చేసిందేంటి.. కంపెనీ నిర్దేశించిన పర్ఫార్మెన్స్‌ని రీచ్ అయ్యారా లేదా.. ! వాళ్లకు వాళ్లకు ఓ సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్‌కి తగ్గట్లు ఫీడ్‌ బ్యాక్‌ కూడా ఉంటే.. సదరు ఎంప్లాయ్‌కి గుడ్‌న్యూస్ ఉంటుంది. ఇప్పుడు ఈ మ్యాటర్ ఎందుకంటే.. ఏపీలో చంద్రబాబు, టీమ్‌కి ఇదే అప్లై చెయ్యబోతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి ఆరునెలల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిందేంటి? సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ రిపోర్ట్ ఎవరికి వాళ్లు ఇవ్వాలి. ఇక ఆ పనితీరు, ప్రభుత్వ పథకాలు, పాలసీలు ప్రజలకు ఎంతమేర ఉపయోగంగా ఉంటాయనేదానిపై ఫీడ్‌బ్యాక్ తీసుకోబోతున్నారు.. !

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ నెల 12వ తేదీతో 6 నెలలు పూర్తి చేసుకుంటోంది. మరి ఈ కూటమి పాలన పై ప్రజలు హ్యాపీగా ఉన్నారా..? పాలనపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది..? పథకాలపైన ఎలాంటి చర్చ జరుగుతోంది..? ఎమ్మెల్యేలు, మంత్రుల పని తీరు ఎలా ఉంది…?ఈ అంశాలపై సీఎం చంద్రబాబు ఫోకస్‌ చేశారు. ఇందుకోసం ఎమ్మెల్యేలు, మంత్రులకు హాఫ్‌ ఇయర్లీ ఎగ్జామ్స్‌ పెట్టారు.

అంటే ఈ ఆరు నెలల కాలంలో ఎవరు ఏం చేశారు..? ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇలా మంత్రులు సెల్ఫ్‌ అసెస్మెంట్‌ ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. అంశాల వారిగా మొత్తం వర్క్‌ షీట్‌ను డిసెంబర్‌ 12వ తేదీలోపు తన ముందుంచాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో ఈ పరీక్షల్లో పాసయ్యేందుకు, మంచి మార్కులు తెచ్చుకునేందుకు నేతలు కసరత్తులు చేస్తున్నారు. దాని ఆధారంగా 6 నెలల పాలనపై ప్రోగ్రెస్‌ ఇస్తానని చంద్రబాబు తెలిపారు. కేవలం మంత్రులు, ఎమ్మెల్యే ఇచ్చే వర్క్‌ షీటే కాకుండా గ్రౌండ్‌ రియాల్టీ తెలుసుకునేందుకు ప్రజాభిప్రాయం తెలుసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం కొత్త పోగ్రామ్‌ను డిసైడ్ చేశారు.

ఈ పోగ్రామ్‌ కాన్సెప్ట్‌ ఏంటంటే…

ఐవీఆర్‌ఎస్‌ విధానం ద్వారా నేరుగా లబ్ధిదారులకే ఫోన్‌కాల్స్‌ చేసి.. పథకాల అమలు, సేవల్లో నాణ్యత.. తదితర అంశాలపై ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటారు. వాటిపై ప్రజలు ఇచ్చే రేటింగ్ ఆధారంగా ప్రభుత్వం మార్పులు చేర్పులు చేయనుంది. మేయిన్‌గా పింఛన్లు ఇంటి దగ్గరే అందుతున్నాయా? లేదా?.. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పొందటంలో ఇబ్బందులున్నాయా? లాంటి ప్రశ్నల ద్వారా లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఏపీలో అమలు చేస్తున్న పథకాలతో పాటుగా కూటమి ప్రభుత్వం తెచ్చిన ఉచిత ఇసుక విధానం, నూతన మద్యం విధానం సహా ఇతర విధానాలనపైనా ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారు.

ఒకవేళ ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమైతే.. కారణాలపై విశ్లేషంచి ఆయా సేవల్లో అవసరమైన మార్పులు, చేర్పులు చేయనున్నారు. ఏ అంశంపైనైనా ప్రజలు చెప్పిందే ఫైనల్ కావాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..