Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: రెండోసారి ఆడపిల్లే అని నేలకేసి కొట్టి చంపిన కసాయి తండ్రి.. మద్యం మత్తులోనే దారుణం..

ఆడపిల్ల పుట్టిందని కన్నతండ్రే కాలయముడు అయ్యాడు. రెండోసారి కూడా ఆడపిల్లే పుట్టిందని మద్యం మత్తులో రెండేళ్ల కూతురును నేలకేసి కొట్టి చంపాడు ఓ కసాయి తండ్రి. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా మంగళగరిలో చోటుచేసుకుంది.

Andhra Pradesh: రెండోసారి ఆడపిల్లే అని నేలకేసి కొట్టి చంపిన కసాయి తండ్రి.. మద్యం మత్తులోనే దారుణం..
Father Killed His Daughter
Follow us
Surya Kala

|

Updated on: May 30, 2023 | 6:54 AM

ప్రభుత్వం, అధికారులు ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా.. ప్రజల్లో ఎంత అవగాహన కార్యక్రమాలు చేస్తున్నా సమాజంలో ఆడపిల్ల పుట్టింది అంటే చిన్న చూపు ఇంకా తగ్గలేదు. ఆడ, మగ అనే తేడా లేదు.. ఇద్దరు ఒక్కటే అని చెబుతున్నా కొందరు ఇంకా ఆడపిల్ల అంటే భారం బరువు అని అనుకుంటున్నారు. తాజాగా ఆడపిల్ల పుట్టిందని కన్నతండ్రే కాలయముడు అయ్యాడు. రెండోసారి కూడా ఆడపిల్లే పుట్టిందని మద్యం మత్తులో రెండేళ్ల కూతురును నేలకేసి కొట్టి చంపాడు ఓ కసాయి తండ్రి. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా మంగళగరిలో చోటుచేసుకుంది.

గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని ఎంఎస్ పేటలో గోపి అనే వ్యక్తి ఎలక్ట్రిషీయన్‌గా పనిచేస్తున్నాడు. గోపి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టగా.. తనకు మగపిల్లాడు కావాలని భార్యతో గోపి గొడవకు దిగేవాడు. ఈ క్రమంలో.. నిన్న సాయంత్రం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన గోపి.. వారసుడి విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో మొదట పుట్టిన రెండేళ్ల బిడ్డను గోపి నేలకేసి కొట్టాడు. తీవ్ర గాయాలైన పాపను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్తుండగా ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు గోపిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..